- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యూట్యూబ్ న్యూ ఫీచర్.. ‘క్లిప్స్’
దిశ, ఫీచర్స్: షార్ట్ వీడియోలకు టిక్‌టాక్ చాలా ఫేమస్ కాగా, ఇండియాలో టిక్‌టాక్ బ్యాన్ అయిన తర్వాత షార్ట్ వీడియో ప్లాట్‌ఫాంలు పోటెత్తాయి. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రాం ‘రీల్స్’ పేరుతో టిక్‌టాక్ లాంటి ఫీచర్‌ను తీసుకొచ్చింది. యూట్యూబ్ ‘షార్ట్స్’ పేరుతో ఓ కొత్త ఫీచర్‌ను గతేడాదే ఇంట్రడ్యూస్ చేసింది. దీంతో 15 సెకన్ల నిడివి ఉండే వీడియోను అప్‌లోడ్ చేసే సదుపాయం కల్పించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం యూట్యూబ్ మరో కొత్త ఫీచర్‌ను టెస్ట్ చేస్తోంది. యూట్యూబ్ ‘క్లిప్స్’గా పిలుస్తున్న ఈ ఫీచర్ విశేషాలేంటో తెలుసుకుందాం.
‘యూట్యూబ్ క్లిప్స్’ ప్రస్తుతం బెటా వెర్షన్‌లో ఉండగా, పరిమిత సంఖ్యలో కొంతమంది వినియోగదారులతో పాటు, కొన్ని గేమింగ్ చానల్స్‌కు మాత్రమే ఇది అందుబాటులో ఉంది. వినియోగదారుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా తగిన మార్పులు చేసి త్వరలో అందరికీ అందుబాటులోకి తీసుకురానుంది యూట్యూబ్. ఇప్పటి వరకు యూట్యూబ్ వీడియోలు, ప్రత్యక్ష ప్రసారాలను షేర్ చేయాలంటే, యూఆర్‌ఎల్ ఉపయోగించి మాత్రమే చేసేవాళ్లం అంతేకాదు ఆ క్లిప్ ఎక్కడ నుంచి మొదలవుతుందో అక్కడి నుంచే దాన్ని సెండ్ చేయడం సాధ్యమయ్యేది. కానీ ఈ ఫీచర్ సాయంతో వీడియోలు, లైవ్ స్ట్రీమ్స్‌ను మనకు ఇష్టమైన చోటు నుంచి కట్ చేసుకుని షేర్ చేసుకోవచ్చు. ఈ క్లిప్స్ 5 సెకన్ల నిడివి నుంచి 60 సెకన్ల వరకు ఉండొచ్చు. ప్రస్తుతం ఆండ్రాయిడ్, వెబ్ వెర్షన్‌లకు వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండగా, త్వరలో ఐవోఎస్ కస్టమర్స్‌కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
యూట్యూబ్‌లో ఏదైనా వీడియో ఓపెన్ చేసినా తర్వాత, వీడియో క్లిప్ ఐకాన్ కింద కత్తెర సింబల్ కనిపిస్తే, బెటా వెర్షన్ మీకు అందుబాటులోకి వచ్చినట్లు. ఒకవేళ సీజర్ సింబల్ కనిపిస్తే, దాని మీద క్లిక్ చేస్తే.. ‘క్రియేట్ క్లిప్’ కనిపిస్తుంది. ఆ వీడియో క్లిప్‌లో తమకు ఇష్టమైన పార్ట్‌ను 5 నుంచి 60 సెకన్ల నిడివి మధ్యలో కట్ చేసుకుని ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్‌లో షేర్ చేసుకోవచ్చు. అయితే 8 గంటలపైన ఉన్న లైవ్ స్ట్రీమ్ వీడియోలకు, ప్రీమియం వీడియోలు(స్టిల్ లైవ్‌లో కొనసాగుతున్నవి), ప్రైవేట్ అని రాసి ఉన్న క్లిప్స్, కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌తో పాటు, కిడ్స్ మేడ్ వీడియోలకు మాత్రం ఈ యూట్యూబ్ క్లిప్స్ షేర్ చేయడానికి వీలు లేదు.