యూట్యూబ్ వర్సెస్ టిక్ టాక్

by Shamantha N |   ( Updated:2020-05-11 06:05:01.0  )
యూట్యూబ్ వర్సెస్ టిక్ టాక్
X

దిశ, వెబ్‌డెస్క్: యూట్యూబ్, టిక్‌టాక్ ఈ రెండింటి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే ఈ రెండింటి మధ్య పెద్ద వివాదం జరుగుతోంది. సంస్థల మధ్య కాదు, కంటెంట్ క్రియేటర్స్ మధ్య. అవును… రెండు యాప్‌లకు కంటెంట్ క్రియేటర్లే కీలకం. యూట్యూబ్ స్టార్లు, టిక్‌టాక్ స్టార్లుగా వాళ్లు ఎదగడానికి ఈ యాప్‌లు సాయపడ్డాయి. అటు డబ్బుల విషయంలోనూ, ఫేమ్ విషయంలో రెండూ యాప్‌లు కంటెంట్ క్రియేటర్లకు ఉపయోగపడ్డాయి. అయితే కంటెంట్ పరంగా ఎవరు గొప్ప అనే విషయం గురించి ఇప్పుడు ఇంటర్నెట్ పెద్ద వివాదమే హల్‌చల్ చేస్తోంది. ఎవరికి నచ్చినట్లుగా వాళ్లు ఇంటర్నెట్లో అభిప్రాయాలు వెల్లబుచ్చుకుంటూ వీడియోలు పెడుతున్నారు.

ఈ విషయం గురించి టిక్‌టాక్ చేసే వారిని రోస్ట్ చేస్తూ యూట్యూబర్ క్యారీ మినాటీ ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో టిక్ టాకర్ అమీర్ సిద్ధిఖీ మీద ప్రత్యక్ష దూషణలు కూడా చేశారు. ఈ వీడియో 10 గంటల్లో 43 మిలియన్లకు పైగా వీక్షణలు సంపాదించిందంటే ఈ వివాదం ఎంత తీవ్రస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక యూట్యూబర్ గంటల కొద్దీ కష్టపడి కంటెంట్ తయారు చేస్తారని, అదే టిక్‌టాకర్లు రెండు మూడు నిమిషాల్లో చెత్త కంటెంట్ తయారు చేసి ఫేమస్ అవుతారని క్యారీ మినాటీ తన వీడియోలో అన్నాడు. అయితే యూట్యూబర్లు ఒకరికి ఒకరు సాయం చేసుకోరని, ఒక యూనిటీ అంటూ ఉండదని, ఒకరు చేసిన కంటెంట్‌ను మరొకరి కాపీ కొడతారని అమీర్ సిద్ధిఖీ కౌంటర్ ఇచ్చాడు.

అయితే ఇదే విషయం గురించి ఇంటర్నెట్‌లో చాలా వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. ఫేమస్ టిక్‌టాకర్ల తమ అభిప్రాయాలు తెలుపుకోవడానికి యూట్యూబ్ ఛానళ్లను ఓపెన్ చేస్తుండగా, యూట్యూబర్లు ఏకంగా బ్యాన్‌టిక్‌టాక్ పేరుతో ఒక హ్యాష్ ట్యాగునే ప్రారంభించేశారు. ఇక నెటిజన్లు కూడా తమకు యూట్యూబ్ ఇష్టమా, టిక్ టాక్ ఇష్టమా , ఎవరి కంటెంట్ బాగుంటుందనే విషయం గురించి తీవ్రంగా చర్చలు కూడా చేస్తున్నారు. ఏదీ ఏమైనా ఎవరి టాలెంట్ వారికి ఉన్నపుడు ఏ ప్లాట్‌ఫాం అయితే ఏంటనేది మరి కొందరి అభిప్రాయం.

Advertisement

Next Story

Most Viewed