- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డిజిటల్ పాఠాలపై తల్లిదండ్రులు ఏమంటున్నారో తెలుసా?
దిశ ప్రతినిధి, హైదరాబాద్: ఏడాది క్రితం మొదలైన కరోనా కారణంగా అన్ని రకాల విద్యా సంస్థలు మూత పడ్డాయి. విద్యా సంస్థలు డిజిటల్ బోధనకు తెర తీశాయి. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు సెల్ ఫోన్, ల్యాప్ టాప్ , కంప్యూటర్ ద్వారా పాఠాలు వినేందుకు ఏర్పాట్లు చేశారు. వారు మొదట ఆన్‌లైన్ పాఠాలు సక్రమంగానే విన్నప్పటికీ రానురాను వారు పక్కదారి పట్టారు. చాలా మంది విద్యార్థులు గేమ్స్ ఆడేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. గేమ్స్‌కు బానిసలవుతున్నారని పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. ప్రముఖ ఆన్‌లైన్ కౌన్సెలింగ్, ఎమోషనల్ వెల్నెస్ ప్లాట్‌ఫామ్ బెంగళూర్‌కు చెందిన సంస్థ యువర్ దోస్త్ (www.yourdost.com) ఇటీవల ఈ అంశం మీద తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి సర్వే నిర్వహించింది.
గంటలపాటు కూర్చున్న చోటు నుండి కదలక పోవడం, సమయానికి తినకపోవడం, నిద్ర లేమి వంటివి అనారోగ్యానికి గురి చేస్తున్నాయని తేలింది. ‘ఆన్‌లైన్ గేమింగ్ విద్యా పనితీరును దెబ్బతీస్తుంది. పిల్లలలో హింసాత్మక ప్రవర్తనకు కారణమవుతుంది’ అంటూ కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు మాత్రం ‘పిల్లలకు ఆన్‌లైన్ గేమింగ్ మంచిదే. స్ట్రెస్ నుండి విముక్తి కల్గిస్తుంది. పిల్లల భవిష్యత్‌కు ఎంతగానో ఉపయోగపడుతుంది. కొన్ని పరిమితులతో ఆడనిస్తే ఏమీకాదు’ అని చెబుతున్నారు. సర్వేలో విద్యార్థుల తల్లిదండ్రులే కాకుండా సంస్థ వృత్తి నిపుణులు, గృహిణులు, పదవీ విరమణ చేసినవారు , వ్యవస్థాపకుల తోపాటు ప్రీ-స్కూలర్స్, ప్రీ-టీనేజ్, టీనేజ్, పెద్ద వయస్సు ఉన్నవారి అభిప్రాయలనూ తీసుకున్నారు.
ఎంత మంది? ఏమంటున్నారు?
పాజిటివ్..
ఆన్‌లైన్ గేమింగ్ మంచిదే : 48%
స్ట్రెస్ నుండి విముక్తి కల్గిస్తుంది : 60%
పిల్లల భవిష్యత్‌కు ఉపయోగం : 40%
కొన్ని పరిమితులతో ఓకే : 58%
నిర్ణీత వ్యవధిలో ఆడనివ్వొచ్చు : 57%
వారంలోని కొన్ని రోజులు మాత్రమే : 54%
ప్రయోజనకరంగా ఉంటాయ్ : 61%
అర్థం చేసుకునే శక్తి వస్తుంది : 65%
నెగెటివ్..
ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం : 88%
విద్యా పనితీరును దెబ్బతీస్తుంది : 79%
హింసాత్మక ప్రవర్తన కలిగిస్తుంది : 74%
ప్రతిదానికీ మోతాదు పరిమితి ఉంటుంది
మేము చేసిన అధ్యయనంలో మిశ్రమ ఫీడ్ బ్యాక్ వచ్చింది. ప్రస్తుత డిజిటల్ యుగంలో, ఆన్‌లైన్ గేమింగ్ వైపు సమయం పెరగడంలో ఆశ్చర్యం లేదు. నిజ జీవితంతో ఇప్పుడు మరింత ఎక్కువగా ఉంది. ప్రతిదానికీ దాని మోతాదు పరిమితి ఉంటుంది. తల్లిదండ్రులు తమ పిల్లలను ఆన్‌లైన్ ఆటలను ఆడటానికి అనుమతించే విషయంలో బ్యాలెన్స్ ఉండాలి. గణనీయమైన సంఖ్యలో తల్లిదండ్రులు ఆన్‌లైన్ గేమింగ్ ప్రయోజనాలను , పిల్లల పెరుగుదలపై సానుకూల ప్రభావాన్ని కూడా గ్రహించడం ఆసక్తికరంగా ఉంది. చాలా మంది తల్లిదండ్రులు (76.1%) తమ పిల్లల ఆన్‌లైన్ గేమింగ్ అలవాట్లు కుటుంబంలో నిరాశకు కారణమయ్యాయని భావించారు. 78% తల్లిదండ్రులు ఆన్‌లైన్ గేమింగ్ కోసం గ్రౌండ్ రూల్స్ కలిగి ఉండటం చాలా అవసరం అని భావిస్తున్నారు. ఆన్‌లైన్ గేమింగ్‌కు దాని ప్రయోజనాలు ఉన్నాయని చాలా మంది తల్లిదండ్రులు అంగీకరిస్తున్నప్పటికీ, గేమింగ్ ఒక వ్యసనంగా మారుతుందనే భయంతో ఉన్నారని అధ్యయనం వెల్లడించింది. – రిచాసింగ్- దోస్త్ సీఈఓ