యువకుడి ప్రాణం తీసిన ‘చిన్న తప్పు’.. తలకు బలమైన గాయమై..!

by Sumithra |
యువకుడి ప్రాణం తీసిన ‘చిన్న తప్పు’.. తలకు బలమైన గాయమై..!
X

దిశ, కుత్బుల్లాపూర్ : అతివేగంగా వచ్చిన ద్విచక్ర వాహనదారుడు అదుపుతప్పి కింద పడటంతో తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం వెలుగుచూసింది. సీఐ సైదులు కథనం ప్రకారం..కుత్బుల్లాపూర్ సర్కిల్ జగద్గిరిగుట్టలోని శిరిడిహిల్స్‌కు చెందిన శివశంకర్ కుమారుడు వినేశ్(20) ఈరోజు ఉదయం అల్విన్ కాలనీ నుంచి జగద్గిరిగుట్ట వైపు బైకు పై వెళ్తున్నాడు.

జగద్గిరిగుట్టలోని నవీన్ వైన్స్ వద్దకు రాగానే వాహనం అదుపుతప్పి కిందపడిపోయాడు. తలకు బలమైన గాయాలవడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు హెల్మెట్‌ను తలకు ధరించకుండా ముందు పెట్టుకున్నాడని, తలకు పెట్టుకుని ఉంటే ఇంత దారుణం జరగకపోయి ఉండేదని స్థానికులు అనుకుంటున్నారు. అతను చేసిన చిన్న తప్పు వలన కుటుంబసభ్యులకు శోకం మిగిల్చాడని అందరూ అనుకుంటున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Advertisement

Next Story