వైశాఖ అమావాస్య ఎఫెక్ట్.. ప్రయాగ్‌రాజ్‌కు పొటెత్తిన భక్తులు

by Mahesh |
వైశాఖ అమావాస్య ఎఫెక్ట్.. ప్రయాగ్‌రాజ్‌కు పొటెత్తిన భక్తులు
X

దిశ, వెబ్ డెస్క్: ఈ రోజు ఆదివారం వైశాఖ అమావాస్య (Vaisakha Amavasya) కావడంతో ప్రయాగ్‌రాజ్‌ (Prayagraj) భక్తులు ఒక్కసారిగా పోటెత్తారు. రోజు హిందూ సంప్రదాయంలో పూర్వీకులను స్మరించడానికి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడానికి అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. దీంతో ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్), గంగా నది ఒడ్డున ఉన్న ఒక పవిత్ర స్థలం (Holy place) అయిన సంగంలో భక్తుల రద్దీ పెరిగింది. ఈ రోజున గంగా స్నానం చేస్తే.. పుణ్యఫలాలను ఇస్తుందని ప్రజలు నమ్ముతారు. వైశాఖ అమావాస్య సందర్భంగా, ప్రయాగ్‌రాజ్‌లో లక్షలాది భక్తులు (Millions of devotees) సంగమంలో స్నానం చేయడానికి చేరుకోవడంతో ఆ ప్రాంతం మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయింది.

దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్త చర్యలను తీసుకుంది. సంగం ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా.. కుంభమేళా తరహాలో ఏర్పాట్లను చేశారు. దీంతో ఈ రోజు తెల్లవారు జామునే ప్రయాగ్ రాజ్ చేరుకున్న భక్తులు తమ పూర్వికులకు పూజలు చేసి.. గంగా నదిలో పవిత్ర స్నానం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వీడియోలో భక్తులు తెల్లవారుజామున పెద్ద ఎత్తున్న ప్రయాగ్ రాజ్ చేరుకోవడం స్పష్టంగా కనిపించింది.



Next Story

Most Viewed