TTD: భారీగా పెరిగిన భక్తుల రద్ధీ.. శ్రీవారి సర్వదర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..?

by Mahesh |
TTD: భారీగా పెరిగిన భక్తుల రద్ధీ.. శ్రీవారి సర్వదర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: సమ్మర్ హాలీడేస్ కు తోడు.. వీకెండ్ తోడవ్వడంతో ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల తిరుపతి దేవస్థానానికి (Tirumala Tirupati Devasthanam) భక్తులు పోటెత్తారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ (Crowd of devotees) విపరీతంగా పెరిగిపోయింది. ఈ రోజు తెల్లవారు జమునా శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్ట్మెంట్ల (31 compartments)లో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఈ క్రమంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు (TTD officials) తెలిపారు. ఇదిలా ఉంటే శనివారం కూడా తిరుమలలో భక్తుల రద్ధీ కొనసాగింది. నిన్న స్వామివారిని 82,811 మంది దర్శించుకున్నారు. దీంతో శనివారం ఒక్కరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.24 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

ఇదిలా ఉంటే కశ్మీర్ లో ఉగ్రదాడి (terrorist attack) అనంతరం అప్రమత్తం అయిన భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లోని పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాలకు అలర్ట్ జారీ చేసింది. దీంతో తిరుమల తిరుపతి అధికారులు అప్రమత్తమై హై అలర్ట్ (High alert) ప్రకటించారు. తిరుమల కొండపై అడుగడుగున తనిఖీలు నిర్వహిస్తున్నారు. అలాగే కొండ పైకి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దాడులు జరగవచ్చనే అనుమానంతో ప్రత్యేక సిబ్బందిని తిరుమలకు తరలించారు. వారు.. దాడులు జరిగితే ఎలా రెస్పాండ్ అవ్వాలనే దానిపై మాక్ డ్రిల్ కూడా నిర్వహించారు. అలాగే వేసవి కావడంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవకుండా టీటీడీ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.



Next Story