- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మేడ్చల్‌లో దారుణం.. యువకుడి ప్రాణం తీసిన డెంగీ
దిశ, శామీర్‌పేట్ : డెంగీ జ్వరం బారిన పడి ఓ యువకుడి మృతి చెందాడు. మేడ్చల్ జిల్లా శామీర్ పేట పరిధిలోని అలియాబాద్ గ్రామానికి చెందిన రాకేష్ (25) ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. గతవారం రోజుల కిందట జ్వరం రావడంతో సీజనల్ వ్యాధి అనుకున్నాడు. జ్వరం తీవ్రస్థాయికి చేరుకోవడంతో ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా డెంగీ జ్వరంగా నిర్ధారణ అయ్యింది. దీంతో వైద్యం కోసం పలు ఆస్పత్రుల్లో చేర్పించినా ప్రయోజనం లేకపోయింది.
పరిస్థితి విషమించడంతో రాకేష్ ప్రాణాలు కోల్పోయాడు. అలియాబాద్‌లో రోజురోజుకూ సీజనల్ వ్యాధులు, డెంగీ జ్వరాలు పెరుగుతున్నప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెగ్యూలర్‌గా బ్లీచింగ్, ఫాగింగ్ చేయడం, మురుగు నీటిని తొలగించడం వంటి చర్యలు చేపట్టడంలో గ్రామ పంచాయతీ, ఆరోగ్యశాఖలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.