- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
దారుణం.. యువతి ప్రాణం తీసిన మద్యం మత్తు..

దిశ, మొయినాబాద్: హైదరాబాద్- బీజాపూర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో అతివేగంతో కారు నడిపిన ఓ వ్యక్తి స్కూటీని ఢీకొట్టాడు. స్కూటీపై వెళ్తున్న యువతి అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం అర్ధరాత్రి ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెడ్డిపల్లి గ్రామానికి చెందిన మోర వెంకటేష్ కూతుర్లు ప్రేమిక (16), సౌమ్య, అక్షయ శనివారం రాత్రి సమయంలో స్కూటీపై కనకమామిడి వైపు వెళ్తున్నారు. అదే సమయంలో చేవెళ్ల వైపు నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు అతివేగంతో ఎదురుగా వచ్చి స్కూటీని ఢీకొట్టింది.
దీంతో స్కూటీపై ఉన్నా ముగ్గురు రోడ్డుపై పడిపోయారు. ప్రేమిక అనే యువతికి తలకు ఎక్కువగా గాయాలవ్వడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. మిగిలిన ఇద్దరికి గాయాలు అవ్వడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. అతివేగంతో కారు నడపడం వల్లే ప్రమాదం జరిగింది అని మొయినాబాద్ పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.