గోదావరిలో నీట మునిగినవారిని కాపాడిన యువకులు

by Sridhar Babu |
Jenco-Employee1
X

దిశ, మహదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వరరం వద్ద గోదావరి నదిలో ఆదివారం స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు భూపాలపల్లికి చెందిన జెన్‌కో ఉద్యోగి తిరుపతి రెడ్డి, ఆయన బంధువులు ప్రియాంక, వినుత్న నీటిలో మునిగిపోయారు. అక్కడే ఉన్న స్థానిక గజ ఈత గాళ్లు, ఫొటో గ్రాఫర్లు నాగుల శేఖర్, గణేష్ నాయక్ లు వారిని చాకచక్యంగా కాపాడి ఒడ్డుకు చేర్చారు. దీంతో వారిని పలువురు అభినందించారు.

Advertisement

Next Story