సెలెక్ట్ కాలేదు.. రైలు కిందపడ్డాడు

by Sumithra |
సెలెక్ట్ కాలేదు.. రైలు కిందపడ్డాడు
X

దిశ, స్టేషన్ ఘనపూర్: జనగామ జిల్లాలో యువకుడి ఆత్మహత్య కలకలం రేపింది. ఆర్మీలో సెలెక్ట్ కాలేదన్న మనస్థాపంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చిల్పూర్ మండలం చిన్నపెండ్యాల గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన వేమూరి రవీందర్ కుమారుడు శ్రీనివాస్ (20) ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు.

రెండు మూడు సార్లు ఆర్మీ సెలక్షన్‌కు వెళితే సెలెక్ట్ కాలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన శ్రీనివాస్ రాంపూర్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story