ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కి యువకుడు ఆత్మహత్య.. అదే కారణామా..?

by Sumithra |
ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కి యువకుడు ఆత్మహత్య.. అదే కారణామా..?
X

దిశ, వెబ్‌డెస్క్ : మలక్ పేటలో ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. విద్యుత్ ప్రవాహం అవుతున్న ట్రాన్స్ ఫార్మర్ ఎక్కి ప్రాణాలు తీసుకున్నాడు. అక్బర్ బాగ్‌లోని దిల్‌ఖుష్ ఫంక్షన్ హాల్ సమీపంలో ఓ అపార్ట్ మెంట్ లో వాచ్ మెన్‌గా పని చేస్తున్న అక్బర్ ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. అపార్ట్ మెంట్ నుంచి నేరుగా ట్రాన్స్ ఫార్మర్ వద్దకు వచ్చిన అక్బర్ దానిని ఎక్కి కరెంట్ తీగలను పట్టుకున్నాడు. దీంతో విద్యుత్ షాక్ తగిలి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దృశ్యాలన్నీ సమీపంలోని సీసీ కెమెరాలో రికార్టు అయ్యాయి. కాగా, అక్బర్ కుటుంబ కలహాల నేపధ్యంలోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సైదాబాద్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Advertisement

Next Story