- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Addanki Dayakar: కొత్త ప్రభాకర్ రెడ్డికి నార్కో టెస్ట్ చేయించాల్సిందే.. అద్దంకి దయాకర్

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని (Congress Government) కూల్చాలంటూ తమకు అభ్యర్థనలు వస్తున్నాయని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (MLA Kottha Prabhakar Reddy) చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పొలిటికల్‌గా చిచ్చును రాజేశాయి. ఈ పరిణామంతో బీఆర్ఎస్ పార్టీ (BRS Party)పై అధికార పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ (MLC Addanki Dayakar) సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వాన్ని కూల్చుతామంటూ మాట్లాడిన కొత్త ప్రభాకర్ రెడ్డికి వెంటనే నార్కో అనాలిసిస్ టెస్ట్ (Narco Analysis Test) చేయించాలని డిమాండ్ చేశారు. అప్పుడే అసలు నిజాలు బయటకు వస్తాయని అన్నారు. వెంటనే ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. సంక్షేమంలో దూసుకెళ్తోన్న ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేందుకు తెర వెనుక బీఆర్ఎస్ (BRS) భారీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. బీజేపీ (BJP), గుజరాత్ (Gujarat) వ్యాపారులతో కలసి గులాబీ పార్టీ ఈ కుట్రకు తెర లేపిందని కామెంట్ చేశారు. కొత్త ప్రభాకర్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) నియోజకవర్గమైన గజ్వేల్‌కు ఇంచార్జీగా ఉన్నారని.. ప్రభుత్వానికి కూల్చాలనే ఆలోచన ముమ్మాటికీ కేసీఆర్‌దేనని అద్దంకి దయాకర్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.