అవును.. ఆ అమ్మాయి నన్ను ప్రేమలో పడేసింది – అడవి శేష్

by Shyam |   ( Updated:2021-06-03 04:41:21.0  )
అవును.. ఆ అమ్మాయి నన్ను ప్రేమలో పడేసింది – అడవి శేష్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్ ప్రేమలో పడ్డాడు. థ్రిల్లర్ సినిమాలతో టాలీవుడ్ లో వరుస హిట్లను అందుకుంటున్న ఈ యంగ్ బ్యాచిలర్ హీరో తన ప్రేమ విషయాన్ని ఎట్టకేలకు బయటపెట్టాడు. ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకున్నాడు. మీ లైఫ్ లో ఎవరైనా అమ్మాయి ఉన్నారా..? అన్న ప్రశ్నకు శేష్ సమాధానమిస్తూ “అవును .. నేను ప్రేమలో ఉన్నాను. తను హైదరాబాద్ కి చెందిన అమ్మాయే. తన అనుమతి లేకుండా తన వివరాలను వెల్లడించలేను” అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకొనే ఉద్దేశం లేదని, ప్రస్తుతం కెరీర్ పైన ఫోకస్ చేస్తున్నట్లు తెలిపాడు. ఇక శేష్ తన ప్రేయసి గురించి చెప్పడంతో అభిమానులు ఎవరా.. హైదరాబాదీ అమ్మాయి అంటూ ఆరాలు తీసేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం శేష్ ‘మేజర్’, ‘గూఢచారి 2’ చిత్రాలతో బిజీ గా ఉన్నాడు.

Advertisement

Next Story