నీళ్లు తాగి వెళ్తుండగా కుప్పకూలిన యువరైతు..

by Sridhar Babu |
నీళ్లు తాగి వెళ్తుండగా కుప్పకూలిన యువరైతు..
X

దిశ, పెద్డపల్లి : పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రానికి చెందిన మందల రమేష్ రెడ్డి అనే యువ రైతు మార్కెట్ యార్డ్‌లో ఒక్కసారిగా కుప్పకూలాడు. తాను తీసుకొచ్చిన ధాన్యాన్ని ఒక దగ్గర కుప్పగా పోస్తుండగా గుండెపోటు రావడంతో రమేష్ రెడ్డి కింద పడిపోయినట్లు సమాచారం. వారి పొలంలోని వడ్లను శుక్రవారం కోసిన ఈ యువరైతు రాత్రి మార్కెట్ యార్డుకు వచ్చాడు.

పని ముగిసాక హమాలి వాళ్లు ఉండే రేకుల షెడ్డుకు వెళ్లి అక్కడ కొన్ని నీళ్ళు తాగాడు. తిరిగి మార్కెట్ లోపలకు వెళ్తుండగా అకస్మాత్తుగా కింద పడిపోయాడు. అది గమనించిన హమాలీలు అతన్ని లేపేందుకు ప్రయత్నించగా ఎంతకూ లేవలేదు. తీరా అతను మృతి చెందినట్లు నిర్దారించుకున్నారు. విషయం తెలియడంతో తల్లి సత్యవతి రోదనలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న కాల్వ శ్రీరాంపూర్ ఎస్సై వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story