- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పొలం పనులకు వెళ్తుండగా… పాముకాటుతో యువరైతు మృతి
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: తన పొలంలో ఉన్న పంట కాపలాకు వెళ్లిన యువరైతు మళ్లీ తిరిగిరాలేదు. ఏం జరిగిందో అని వాకబు చేయగా పాము కాటుకు బలైయ్యాడని తెలిసింది. వివరాల్లోకవెళితే.. కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం నల్లమడుగు గ్రామంలో మొక్కజొన్న పంట కుప్ప వద్ద కాపలాకు వెళ్లిన రైతు మెట్టు ప్రభాకర్ (32) ఇంటికి తిరిగిరాలేదు.
ఇంట్లో వారు ఆరా తీయగా పాము కాటు వేయడంతో మరణించినట్టు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలిపించారు. పొలం పనులకు వెళ్లే సమయంలోనే పాము కాటుకు గురై మరణించినట్టు వైద్యులు పోస్టుమార్టం తర్వాత నిర్దారించారు. మృతుడికి భార్య ప్రసన్న, ఇద్దరు కుమారులు, ఒక్క కూతురు ఉన్నారు. ప్రభుత్వం పరంగా ఆ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Advertisement
- Tags
- crimenews
Next Story