న్యాయవ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు యత్నం

by srinivas |
న్యాయవ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు యత్నం
X

దిశ, వెబ్‎డెస్క్ :
ఏపీలో న్యాయవ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు వ్యాఖ్యానించారు. న్యాయమూర్తులకు ఉద్దేశాలను ఆపాదించరాదని రాజ్యాంగం స్పష్టంగా చెబుతున్పప్పటికీ.. రాష్ట్రంలో దాడులు ఆగడం లేదని విమర్శించారు.

ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ.. న్యాయమూర్తులు, కోర్టులపై సోషల్‌ మీడియా వేదికగా దూషించిన వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేని స్థితిలో సీఐడీ రాష్ట్రంలో ఉందని విమర్శించారు. వైసీపీ నేతలకు ఇబ్బంది కలిగించేలా వ్యాఖ్యలు చేస్తే మాత్రం వెంటనే కేసులు నమోదవుతాయని ఆరోపించారు.

నాడు కౌరవసభలో ద్రౌపది వస్త్రాపహరణం జరిగిందని.. నేటి కౌరవసభలో న్యాయదేవతకు వస్త్రాపహరణం జరుగుతోందని చెప్పారు. ఇలాంటి కౌరవసభలో తాను కూడా ఉన్నందుకు సిగ్గుపడుతున్నానని రఘురామ కృష్ణరాజు వ్యాఖ్యానించారు. ఆనాడు ద్రౌపదిని గోవిందుడు కాపాడాడని.. నేడు న్యాయవ్యవస్థను కోవిందుడ (రాష్ట్రపతి) కాపాడతారని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed