మల్టీజోన్ -2లో పనిచేస్తున్న కానిస్టేబుళ్లకు పదోన్నతులు.. ఉత్తర్వులు జారీ

by Ramesh Goud |
మల్టీజోన్ -2లో పనిచేస్తున్న కానిస్టేబుళ్లకు పదోన్నతులు.. ఉత్తర్వులు జారీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : మల్టీజోన్ -2 లో కానిస్టేబుళ్లుగా పని చేస్తున్న 262 మందికి హెడ్ కానిస్టేుబుళ్లుగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మల్టీ జోన్ -2 ఐజీపీ సత్యనారాయణ గురువారం ఉత్తర్వులను వెల్లడించారు. చార్మినార్ జోన్ పరిధిలోని కానిస్టేబుళ్లకు పదోన్నతి కల్పించినట్లు ఐజీపీ సత్యనారాయణ తెలిపారు. హైదరాబాద్ సిటీ పరిధిలో 73 మందికి , సైబరాబాద్ పరిధిలో 147 మంది, సంగారెడ్డి పరిధిలో 18 మంది, వికారాబాద్ పరిధిలో 17మంది, డిప్యుటేషన్ లో ఉన్నా 7గురుకి హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కలిగింది.



Next Story

Most Viewed