- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
బదిలీలతో పాటు సమస్యలు పరిష్కరించండి.. అధికారులకు టీజీఓ నాయకుల వినతి

దిశ, తెలంగాణ బ్యూరో: ఎక్సైజ్ శాఖలోని ఉద్యోగుల బదిలీలతో పాటు ఎదుర్కొంటున్న పలు ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీజీవో సెంట్రల్ అసోసియేషన్ సభ్యులు గురువారం ఎక్సైజ్ కమీషనర్ హరి కిరణ్, ఇంచార్జ్ అడిషనల్ కమిషనర్ ఎస్‌వై ఖురేషీ లను కలిసి విన్నవించారు. ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ బదిలీలు జరగక దాదాపు 8 సంవత్సరాలు గడిచిందని టీజీవో సభ్యులు తెలిపారు. జీవో .317 అమలులో భాగంగా బదిలీలు చేశారని ఉద్యోగులందరికి మూడున్నర సంవత్సరాలు గడిచినా ఈ శాఖలో బదిలీలకు నోచుకోలేదని వివరించారు. ఈ వేసవి సెలవుల్లో బదిలీలు జరగకపోతే పిల్లల అడ్మిషన్ల పరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని తెలిపారు.
ఈ విషయాన్ని ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు అనేక సార్లు విన్నవిచండం జరిగిందని, ఆయన హామీ కూడా ఇవ్వడం జరిగిందని తెలిపారు. దీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న పదోన్నతులు, సర్వీస్ రూల్స్ సవరణలు, విధి నిర్వహణలో ఉండి ప్రమాదానికి గురైన వారికి ప్రమాద భీమా కల్పించాలనే డిమాండ్లతో సహ 17 ప్రధాన సమస్యల్ని పరిష్కరించాలని విన్నవించారు. ఎక్సైజ్ కమీషనర్ సానుకూలంగా స్పందించి అతి త్వరలోనే బదిలీలు చేస్తామని, ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామి ఇచ్చినట్లు టీజీవో సభ్యలు తెలిపారు. టీజీవో సెంట్రల్ ప్రెసిడెంట్ ఏలూరి శ్రీనివాసరావు, జనరల్ సెక్రటరి ఏ సత్యనారాయణ, సెంట్రల్ బేరెర్స్ రామకృష్ణగౌడ్, పరమేశ్వర రెడ్డి, ఎంబీ కృష్ణ యాదవ్ కమిషనర్, అడిషనల్ కమిషనర్ ను కలిసిన వారిలో ఉన్నారు.