మాజీ మంత్రి గంటాకు వైసీపీ నిరసనల సెగ

by srinivas |   ( Updated:2020-08-06 04:02:05.0  )
మాజీ మంత్రి గంటాకు వైసీపీ నిరసనల సెగ
X

దిశ, వెబ్ డెస్క్ :
మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరనున్నారనే ప్రచారం మేరకు అధికార పార్టీ శ్రేణులు ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాయి. గంటాను పార్టీలో చేర్చుకోవద్దంటూ చిన్నాపురం, తగరపు వలస, వీఎం పాలెం వద్ద ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

వైకాపా అధిష్ఠానం కార్యకర్తల మనోభావాలు గుర్తించాలని కోరుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. భీమిలి నియోజకవర్గ కార్యకర్తలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. వైసీపీలోకి గంటా రాకను విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మీడియా ద్వారా బహిరంగంగానే ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

2014 ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు భీమిలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా, అవంతి శ్రీనివాస్‌ అనకాపల్లి ఎంపీగా తెదేపా నుంచే పోటీ చేసి గెలుపొందారు. 2019 ఎన్నికలకు కొద్దిరోజుల ముందు అవంతి శ్రీనివాసరావు వైసీపీలో చేరి భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత జగన్ కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed