‘గంట’లు ఎందుకు మూగబోయాయి శీను

by Anukaran |   ( Updated:2020-07-17 01:37:51.0  )
‘గంట’లు ఎందుకు మూగబోయాయి శీను
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో పాలన గాడితప్పిందని, ఏడాది పాలనలో 65 సార్లు కొర్టులతో మొట్టికాయలు వేయించుకుందని, కక్షసాధింపు చర్యలతో ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెడుతోందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు టీడీపీ పార్లమెంట్ సభ్యుల బృందం ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ మాధ్యమంగా… ‘రాష్ట్రపతికి ఫిర్యాదుల పేరుతో పచ్చ బ్యాచ్ ఢిల్లీలో కొత్త డ్రామాలు మొదలెట్టింది. నేరం చేసిన వారిపై కేసు పెడితే ప్రజాస్వామ్యం ఖూనీ చేసినట్లు, అవినీతిపరులను అరెస్ట్ చేస్తే రాజ్యాంగం విఫలం అయినట్లు, శాంతి భద్రతలు క్షిణించినట్లు అట. మీ డ్రామాలు చూసి ఊసరవెల్లులు సిగ్గుపడుతున్నాయి’ అని ఎద్దేవా చేశారు.

మరో ట్వీట్‌లో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి చోటుచేసుకుందని చెబూతూ… ‘బడికొస్తా పథకం పేరుతో 1,82,000 సైకిళ్లను బాలికలకు పంపిణీ చేశారట. ఎందరికి అందాయో, ఇచ్చినట్టు ఏ రికార్డుల్లో రాశారో దర్యాప్తులో వెల్లడవుతుంది. 30-40 ఏళ్ల కిందటి సైకిళ్లు ఇప్పటికీ రోడ్లపైన కనిపిస్తాయి. మూడేళ్లలోనే అమ్మాయిల సైకిళ్ల ‘గంట’లు ఎందుకు మూగబోయాయో శీను మాయ తెలియాల్సి ఉంది’ అంటూ గంటా శ్రీనివాసరావును ఉద్దేశించి ట్వీట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed