ఇదే సరైన సమయం: యశ్వంత్ సిన్హా

by Shamantha N |
ఇదే సరైన సమయం: యశ్వంత్ సిన్హా
X

ఢిల్లీ: బీజేపీ అజేయమైన పార్టీ అనే భ్రమలను బెంగాల్‌లో మమతా బెనర్జీ తొలగించిందని, 2024లో ఆ పార్టీని బీట్ చేయడానికి ప్రతిపక్షాలన్ని ఐక్యమవడానికి ఇదే సరైన సమయమని యశ్వంత్ సిన్హా సోమవారం అన్నారు. శరద్ పవార్‌తో ఈ రోజు భేటీ కాబోతున్న కీలక నేతల్లో సిన్హా ఒకరు. ఈ బేటీకి పిలుపు వచ్చిన తర్వాత స్పందిస్తూ బీజేపీని ఓడించడానికి విపక్ష నేతలే ఏకమై వస్తున్నట్టు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పాత్ర గురించి అడగ్గా, ఈ ప్రతిపక్షాల కూటమిలో కాంగ్రెస్ చేరడం ప్రయోజనకరమని, కానీ, అది కాంగ్రెస్ పార్టీ నిర్ణయమని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌లోనూ పరిణత నేతలున్నారని, వారు దీని గురించి యోచించాలని తెలిపారు. కాగా, విపక్ష కూటమి లీడర్ ఎవరని ప్రశ్నించగా, అది ఒక ట్రాప్ అని, ‘మీ లీడర్ ఎవరు?’ అని బీజేపీ ఇలాంటి వల వేస్తుందని అన్నారు. ప్రజలు ఆశీర్వదించి మెజార్టీని కట్టబెట్టాక ఎవరినో ఒకరిని ప్రధానిని చేస్తామని పేర్కొన్నారు. నిజానికి బీజేపీలో కంటే ప్రతిపక్షాల్లోనే చాలా మంది నేతలున్నారని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed