సౌతాఫ్రికా నుంచి భారత్ కు మరో 8 చీతాల రాక

by Shamantha N |
సౌతాఫ్రికా నుంచి భారత్ కు మరో 8 చీతాల రాక
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్ కు మరో 8 చీతాలు రానున్నాయి. సౌతాఫ్రికాలోని బోట్స్ వానా నుంచి చీతాలను తీసుకురానున్నారు. రెండు విడతల్లో చీతాలు రానున్నట్లు జాతీయ పులుల సంరక్షణ కమిటీ(NTCA) మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి సమాచారమిచ్చింది. మేలో 4 చీతాలు భారత్‌కు చేరుకుంటాయని అధికారులు తెలిపారు. తర్వాత మరో నాలుగు చిరుతలను తీసుకురానున్నట్లు వెల్లడించారు. కేంద్ర పర్యావరణ, అటవీ వాతావరణ మార్పుల మంత్రి భూపేంద్ర యాదవ్, రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నేతృత్వంలో భోపాల్‌లో జరిగిన చిరుత ప్రాజెక్ట్ సమీక్ష సమావేశంలో ఎన్‌టీసీఏ అధికారులు ఈవిషయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది.

చిరుతల ప్రాజెక్టు కోసం రూ.122 కోట్లు ఖర్చు

దేశంలో చిరుత ప్రాజెక్ట్ కోసం ఇప్పటివరకు రూ.112 కోట్లకు పైగా ఖర్చు చేశామని, అందులో 67 శాతం మధ్యప్రదేశ్‌లో చిరుత పునరావాసానికి వెళ్లిందని అధికారులు తెలియజేశారు. ‘ప్రాజెక్ట్ చీతా’ కింద చిరుతలను రాజస్థాన్ సరిహద్దును ఆనుకొని ఉన్న గాంధీ సాగర్ అభయారణ్యంలోకి దశలవారీగా తరలించనున్నట్లు పేర్కొన్నారు. కాబట్టి మధ్యప్రదేశ్‌.. రాజస్థాన్ మధ్య అంతర్-రాష్ట్ర చిరుత సంరక్షణ ప్రాంతాన్ని ఏర్పాటుచేయడానికి సూత్రప్రాయంగా ఒప్పందం కుదిరిందని తెలిపారు.అంతేకాకుండా, కూనో నేషనల్ పార్క్‌లో 26 చిరుతలు ఉన్నాయని అటవీ అధికారులు తెలియజేశారు. 2023 ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుండి కూనో నేషనల్ పార్కుకు 12 చిరుతలను తీసుకొచ్చినట్లు తెలిపారు. కాగా.. అ మరో 14 పిల్లలకు జన్మనిచ్చాయని వెల్లడించారు. వాటిలో 16 బహిరంగంగా అడవిలో ఉండగా.. మరో 10 చీతాలు పునరావాస కేంద్రంలో (ఎన్‌క్లోజర్లు) ఉన్నాయన్నారు. ఉపగ్రహ కాలర్ ఐడీలను ఉపయోగించి నిరంతరం చిరుతలను పర్యవేక్షణ జరుగుతుందన్నారు.



Next Story