- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హీరోయిన్ హార్ట్ ఫెల్ట్ నోట్.. నన్ను క్షమించు.. ఈ గిల్టీ ఫీలింగ్‌తో బతకలేను
దిశ, సినిమా: తమిళ్ యాక్ట్రెస్ యషికా ఆనంద్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ యాక్సిడెంట్‌లో తన బెస్ట్ ఫ్రెండ్ పావని అక్కడికక్కడే చనిపోగా.. మిగిలిన స్నేహితులతో పాటు తీవ్రంగా గాయపడి ఈ మధ్యే కోలుకున్న యషికా.. పావని గురించి హార్ట్ ఫెల్ట్ నోట్ షేర్ చేసింది. తాను ఇప్పుడు ఎంతటి భారమైన పొజిషన్‌లో ఉన్నానో అర్థం కావడం లేదంటూ.. లైఫ్ లాంగ్ గిల్టీ ఫీలింగ్‌తోనే జీవించాల్సి వస్తుందని, తనను ఇంత పెద్ద ప్రమాదం నుంచి కాపాడినందుకు దేవుడికి థాంక్స్ చెప్పాలా లేక బెస్టెస్ట్ ఫ్రెండ్‌ను దూరం చేసినందుకు బ్లేమ్ చేయాలా? అర్థం కావడం లేదని బాధపడింది.
https://www.instagram.com/p/CSFnQNNIFT2/
ప్రతీ సెకన్ తనను మిస్ అవుతానన్న యషికా..”నాకు తెలుసు నువ్వు ఎప్పటికీ క్షమించవని, నీ ఫ్యామిలీని అంత హారిబుల్ సిచ్యువేషన్‌లో ఉంచినందుకు క్షమించు. ఏదో ఒక రోజు నీ కుటుంబం నన్ను క్షమిస్తుందని నమ్ముతున్నా” అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. అలాగే తనతో ముడిపడిన జ్ఞాపకాలను జీవితాంతం గుర్తుంచుకుంటానని, దయచేసి అభిమానులు పుట్టినరోజు వేడుకలు జరపకూడదని యషిక విజ్ఞప్తి చేసింది.