‘మనోజ్ యాదవ్ కుటుంబాన్ని ఆదుకుంటాం’

by Shyam |
‘మనోజ్ యాదవ్ కుటుంబాన్ని ఆదుకుంటాం’
X

దిశ , హైదరాబాద్: కరోనా వ్యాధి బారిన పడి మృతి చెందిన టీవీ5 జర్నలిస్ట్ మనోజ్ కుమార్ యాదవ్ కుటుంబాన్ని ఆదుకుంటామని తెలంగాణ యాదవ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు గురువారం నాంపల్లి లోని ఓ హోటల్ మీటింగ్ హాల్ ప్రాంగణంలో అసోసియేషన్ ప్రతినిధులు మనోజ్ కుమార్ యాదవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ యాదవ్ ఆఫీషల్స్ & ప్రొఫెసనల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంబీ కృష్ణాయాదవ్ మనోజ్ కుమార్ యాదవ్ తదైన శైలిలో రిపోర్టింగ్ చేస్తూ అందరికి అందుబాటులో ఉంటూ ఎక్కడ అన్యాయం జరిగినా నిస్వార్ధం తో పోరాడే వాడని అని అన్నారు. మనోజ్ కుమార్ యాదవ్ మరణం ఎలక్ట్రానిక్ మీడియా రంగానికి తీరని లోటు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో చోళ ఓం ప్రకాష్ యాదవ్, బ్రహ్మానంద యాదవ్, వెంకట్ యాదవ్, కిషోర్ యాదవ్, గోవింద్ యాదవ్, నర్సింహా యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story