మమ్మల్ని ఆదుకోండి.. భిక్షాటన చేస్తోన్న కళాకారులు

by Shyam |
artists begging
X

దిశ, భువనగిరి: తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం గోసి గొంగిడి కట్టి.. ఊరూరా తిరిగి గొంతెత్తి ఆడిపాడిన కళాకారులకు ఉద్యోగాలిచ్చి ఆదుకోవాలని యాదాద్రిభువనగిరి జిల్లా కళాకారులు నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో కళాకారులు భిక్షాటన చేశారు. అంతకముందు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొంతమంది కళాకారులకు మాత్రమే ఉద్యోగాలిచ్చి ఆదుకున్నారని, రాష్ట్రంలో ఇంకా అసలైన కళాకారులు చాలామంది ఉన్నారని, తక్షణమే 550 ఉద్యోగాలు పెంచి, ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అంతేగాకుండా.. అర్హులైన కళాకారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, మూడెకరాల భూమిని కేటాయించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కళాకారులు వేముల హరిక్రిష్ణ, సంజయ్, మధు, శివశంకర్, గణేశ్, నాగులు సాయికుమార్, రవి, శివ, కనకరాజు, దేవేందర్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed