- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కార్చిచ్చు కల్లోలం.. ప్రమాదంలో అతిపెద్ద వృక్షం.. అధికారులు ఏంచేశారంటే..?
దిశ, ఫీచర్స్: అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో కార్చిచ్చు విధ్వంసం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. జూలై 14న కాలిఫోర్నియాలో మొదలైన ఈ కార్చిచ్చు అత్యంత వేగంగా వ్యాపిస్తూ, ఇప్పటివరకు సుమారు 13 రాష్ట్రాలకు విస్తరించింది. దాదాపు 1,305 కిలోమీటర్ల మేర వ్యాపించినట్లు అగ్నిమాపక శాఖ వెల్లడించింది. ఏళ్ల నాటి ఇళ్లు, మ్యూజియమ్స్, భవనాలు కార్చిచ్చు ధాటికి దగ్ధం కాగా ప్రపంచంలోని అతి పెద్ద చెట్లకు నిలయమైన నెవాడాలోని సీక్వోయా నేషనల్ పార్క్ గుండా ఈ మంట విస్తరిస్తోంది. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద వృక్షమైన ‘జనరల్ షెర్మన్’ కూడా ఈ అగ్నికి ఆహూతయ్యే ముప్పు పొంచి ఉండటంతో దాన్ని కాపాడేందుకు ఫైర్‌ఫైటర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
వేలాది ఏళ్ల నాటి వృక్షాలతో పచ్చదనం అలరారుతున్న సీక్వోయా పార్క్ అందాలను చూడటానికి నిత్యం వేలాదిమంది పర్యాటకులు వస్తుంటారు. కాలిఫోర్నియా కార్చిచ్చు ఈ వనంచుట్టూ దావనంలా వ్యాపించడంతో చాలా వృక్షాలు ప్రమాదంలో పడగా, వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది చెట్లను రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడి చెట్లు అగ్ని నిరోధకతను కలిగి ఉన్నప్పటికీ, ఎగిసిపడుతున్న మంటల తీవ్రతకు చెట్లు తగలబడే అవకాశం ఉంది. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద వృక్షమైన ‘జనరల్ షెర్మన్’ చెట్టుతో పాటు, వేల ఏళ్ల నాటి వృక్షాల కాండం భాగానికి అల్యూమినియమ్ రేకును చుట్టారు. షెర్మన్ మహావృక్షం ఎత్తు 275 అడుగులు(పిసా టవర్ కంటే పొడవైనది) కాగా చుట్టుకొలత 103 అడుగులు, దీని వయస్సు 2,200 సంవత్సరాలు.