అందాల పోటీలో భార్యకు రన్నరప్‌.. భర్త వికృత చేష్టలకు అంతా షాక్! (వీడియో)

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-30 13:44:43.0  )
అందాల పోటీలో భార్యకు రన్నరప్‌.. భర్త వికృత చేష్టలకు అంతా షాక్! (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఎల్‌‌జీబీటీక్యూ+ అందాల పోటీలో వింత ఘటన వెలుగుచూసింది. మిస్ బ్రెజిల్ పోటీలో తన భార్యను రన్నరప్‌గా ప్రకటించడంపై భర్త కోపోద్రక్తుడయ్యాడు. దీంతో స్టేజీ పైకి ఎక్కి మిస్ బ్రెజిల్ విజేత కిరీటాన్ని లాక్కుని నెలకేసి కొట్టాడు. శనివారం బ్రెజిల్‌లో జరిగిన LGBTQ+ అందాల పోటీలో ఈ సంఘటన జరిగింది. మిస్ గే మాటో గ్రోస్సో 2023 పోటీలో తన భార్య నాథల్లీ బెకర్ మరో మహిళ ఇమాన్యుయెల్లీ బెలిని ఫైనల్‌కు చేరారు. ఈ క్రమంలో విజేతను ప్రకటించే సమయంలో అందరు ఉత్సాహంగా చూస్తున్నారు.

నాథల్లీ బెకర్ విజేతగా నిలుస్తుందని భావించినప్పటికీ...మిస్ బెలిని చివరకు విజేతగా ప్రకటించారు. అనంతరం బెలినికి కిరీటం అలంకరిస్తున్న సమయంలో రన్నరప్ అయిన బెకర్ భర్త ఒక్కసారిగా స్టేజీపైకి ఎక్కి కిరీటాన్ని లాక్కుని నెలకేసి కొట్టాడు. అనంతరం బెకర్‌ను తీసుకుని వెళ్లిపోయాడు. దీంతో ప్రేక్షకులతో సహా యాజమాన్యం, గెస్ట్‌లు, కంటెస్టెంట్లు అందరు షాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story