- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎర్ర సముద్రంలో అమెరికా దాడులు: ఆ దేశాలే టార్గెట్
దిశ, నేషనల్ బ్యూరో: ఎర్ర సముద్రంలో యూఎస్ వాణిజ్య నౌకను లక్ష్యంగా చేసుకుని హౌతీలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో అమెరికా ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గల్ప్ ఆఫ్ ఎడెన్‌లో యూఎస్ నేవీ మూడు ఇరాన్ డ్రోన్లను, హౌతీలకు చెందిన ఓ బాలిస్టిక్ క్షిపణిని కూల్చివేసినట్టు యూఎస్ మిలిటరీ సెంట్రల్ కమాండ్ తెలిపింది. అయితే ఈ దాడిలో ఎవరికీ నష్టం వాటిల్లలేదని పేర్కొంది. అంతేగాక పది మానవరహిత డ్రోన్లను సముద్రంలో మోహరించినట్టు వెల్లడించారు. ‘గురువారం తెల్లవారుజామున యూఎస్ సెంట్రల్ కమాండ్ దళాలు ఇరాన్ మద్దతుగల హౌతీ గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్‌పై దాడులు నిర్వహించాయి. ఆ ప్రాంతంలోని వ్యాపార నౌకలు, యూఎస్ షిప్‌లకు ప్రమాదం కలిగిస్తున్నాయి’ అని తెలిపింది. కాగా, యెమన్‌కి చెందిన హౌతీలు ఎర్ర సముద్రంలో ప్రయాణించే వాణిజ్య నౌకలపై తమ దాడులను ఇటీవల వేగవంతం చేశారు. గత వారం గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లో బ్రిటిన్ చెందిన ఓ ఇంధన ట్యాంకర్‌ను క్షిపణులతో ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. అంతేగాక నిత్యం వాణిజ్య నౌకలపై దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. దీంతో ఎర్ర సముద్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.