అమెరికాలోని మాల్‌లో ఇద్దరు తెలుగమ్మాయిలు.. ఏం చేశారంటే ..?

by Hajipasha |
అమెరికాలోని మాల్‌లో ఇద్దరు తెలుగమ్మాయిలు.. ఏం చేశారంటే ..?
X

దిశ, నేషనల్ బ్యూరో : ఇద్దరు తెలుగు అమ్మాయిలు అమెరికాలో కష్టాల్లో చిక్కుకున్నారు. న్యూజెర్సీలో చదువుకుంటున్న హైదరాబాద్‌, గుంటూరుకు చెందిన ఇద్దరు యువతులు.. హోబెకన్‌ ఏరియాలోని షాప్‌రైట్‌ సూపర్‌ మార్కెట్‌కు వెళ్లారు. ఈ మాల్‌లో ఎవరు కొనే వస్తువులకు వారే బిల్లింగ్ చేసుకునే సిస్టమ్ ఉంది. అసలు విషయమంతా తెలుగమ్మాయిలు తమ వస్తువులకు బిల్లింగ్ చేసుకునే క్రమంలోనే జరిగింది. వారు చాలా వస్తువులకు బిల్లింగ్ చేయకుండానే నేరుగా తమ సంచుల్లో వేసుకున్నారు. మాల్‌కు చెందిన సీసీ కెమెరా టీమ్ ఇదంతా గమనించి.. అక్కడున్న సెక్యూరిటీ సిబ్బందికి, పోలీసులకు హుటాహుటిన సమాచారాన్ని చేరవేసింది. అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది వచ్చి ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్నారు. ఆ వెంటనే అక్కడికి స్థానిక పోలీసులు వచ్చి ఇంటరాగేట్ చేశారు. మర్చిపోయి ఎక్స్ ట్రా వస్తువులను బ్యాగులో వేసుకున్నామని ఓ యువతి చెప్పగా.. అకౌంటులో డబ్బులు తక్కువగా ఉండటంతో కొన్ని వస్తువులకు బిల్లింగ్ చేయలేదని మరో యువతి పోలీసులకు తెలిపింది. అదనంగా తాము తీసుకున్న వస్తువులకు రెట్టింపు రేటును చెల్లించడంతో పాటు మళ్లీ ఈ మాల్‌లోకి రాబోమని రాతపూర్వక హామీ ఇచ్చేందుకు సిద్ధమని తెలుగమ్మాయిలు చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. వారిని అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషనుకు తరలించారు. కోర్టు ఎదుట హాజరుపరుస్తామని వెల్లడించారు. కాగా, ఈ ఇద్దరు అమ్మాయిలు న్యూజెర్సీలోని స్టీవెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చదువుతున్నట్లు తెలిసింది.

Advertisement

Next Story

Most Viewed