ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు కన్నుమూత..ఆయన ఎవరంటే?

by samatah |
ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు కన్నుమూత..ఆయన ఎవరంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు వెనిజులాకు చెందిన జువాన్ విసెంటె పెరెజ్ మోరా(114) కన్నుమూశారు. ఈ విషయాన్ని వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మధులో వెల్లడించారు. జువాన్ విసెంటే 114ఏళ్ల వయసులో శాశ్వతత్వంలోకి ప్రవేశించాడు అని ఎక్స్‌లో పోస్టు చేశారు. 1909 మే 27న వెనిజులాలోని ఎల్ కోబ్రేలో జన్మించిన పెరెజ్ 2024 ఏప్రిల్ 2న తాచిరాలోని శాన్ జోస్ డీ బొలివర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచాడు. మరణించిన రోజు నాటికి ఆయన వయస్సు 114 ఏళ్ల 311 రోజులు. 115వ పుట్టినరోజుకు రెండు నెలల ముందే మరణించడం గమనార్హం. కాగా. స్పెయిన్‌కు చెందిన సాటర్నినో డి లా ఫ్యూయెంటె గార్సియా మరణం తరువాత ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వ్యక్తిగా విసెంటే ధ్రువీకరించబడ్డారు. గిన్నిస్ బుక్ ప్రకారం..2022న పెరెజ్ ఫిబ్రవరి 4న 112 సంవత్సరాల 253 రోజుల వయస్సులో జీవించి ఉన్న అతి పెద్ద వ్యక్తిగా అధికారికంగా నిర్ధారించారు. 2022 నాటికి అయనకు 41 మనుమలు, 18 మంది మనువరాళ్లు, 12 మంది మునిమనవరాళ్లు ఉన్నారు. 1938 సంవత్సరంలో జువాన్ అడియోఫినా గార్సియా అనే మహిళను పెరెజ్ వివాహం చేసుకోగా.. ఆయన భార్య 1997లో మరణించింది. 2022లో జువాన్ అతి పెద్ద వృద్ధుడిగా ప్రకటించబడినప్పుడు, అతనికి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకపోవడం గమనార్హం.

Advertisement

Next Story