కొడుకుతో మహిళా నేత ఇల్లీగల్ ఎఫైర్.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త.. పార్టీ నుండి సస్పెండ్

by Prasad Jukanti |   ( Updated:2024-05-02 12:16:11.0  )
కొడుకుతో మహిళా నేత ఇల్లీగల్ ఎఫైర్.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త.. పార్టీ నుండి సస్పెండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో:కొడుకుతో రొమాన్స్ చేస్తూ భర్తకు అడ్డంగా దొరికిపోయింది ఓ మహిళా నేత. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తీవ్ర దుమారం రేపుతున్న ఈ ఘటన థాయ్ లాండ్ లో చోటు చేసుకుంది. జాతీయ మీడియాలో కథనాల ప్రకారం ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ‘మేడమ్ ప్లీ’ అని పిలువబడే 45 ఏళ్ల ప్రపాపోర్న్ చోయివాడ్‌కో సెంట్రల్ థాయిలాండ్‌లోని సుఖోథాయ్ ప్రావిన్స్‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకురాలు. ఆమె ప్రస్తుతం స్థానిక చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షురాలిగా పనిచేస్తుండటంతో పాటు గత సంవత్సరం మార్చి నుండి డెమొక్రాట్ పార్టీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. అయితే గతేడాది చోయివాడ్‌కో ఆమె భర్త కలిసి ఓ ఆలయం నుంచి 24 ఏళ్ల ఓ పురుష సన్యాసిని దత్తత తీసుకున్నారు. అయితే ఇటీవల దత్తపుత్రుడితో చోయివాడ్‌కో సన్నిహితంగా మసులుకోవడంతో ఆమె భర్తకు తన భార్య తీరుపై అనుమానం కలిగింది. దీంతో ఆమె బండారాన్ని భయటపెట్టేందుకు ఓ ప్రణాళికను రచించాడు. ఈ క్రమంలో దత్తపుత్రుడితో చోయివాడ్‌కో రొమాన్స్ లొ మునిగితేలుతున్న సమయంలో వారున్న గదిలోకి ఆమె భర్త వెళ్లాడు. అక్కడ వారు నగ్నంగా మంచంపై పడుకున్న దృశ్యాన్ని వీడియో రికార్డు చేశాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో చోయివాడ్‌కో నిర్వాకం థాయిలాండ్, పొరుగు దేశాలతో పాటు సోషల్ మీడియా వినియోగదారులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆమె వ్యవహారంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పార్టీ ఆమెను సస్పెండ్ చేసింది. మరో వైపు వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ఈ వీడియో ఫేక్ లా ఉందని కొందరు కామెంట్స్ చేస్తుంటే.. 24 ఏళ్ల వ్యక్తిని దత్తత తీసుకోవడం ఏంటి అంతా గందరగోళంగా ఉంది అంటూ మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story