వినియోగదారుల హక్కులను కాపాడాలి

by Sridhar Babu |
వినియోగదారుల హక్కులను కాపాడాలి
X

దిశ, కొత్తగూడెం : జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ మాట్లాడుతూ వినియోగదారుల హక్కులు కాపాడటానికి 1986వ సంవత్సరంలో అమల్లోకి వచ్చిందని అన్నారు. ఈ చట్టాన్ని 2019లో మార్పులు చేసి, వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టంగా రూపొందించారన్నారు. వినియోగదారులు రాయితీలు, ఉచిత ప్రకటనలను ఆన్లైన్లో చూసి మోసపోవద్దు అన్నారు. ఇలాంటి మోసాలను హ్యాకర్లు గుర్తించి దోచేస్తారని, పాస్వర్డ్లను సులువుగా పెట్టుకోవద్దని, ఓటీపీలను ఇతరులతో పంచుకోవద్దన్నారు. కొనుగోలు చేసిన వస్తువు తయారీ, చిరునామా, గడువు తేదీ, కస్టమర్ కేర్ నెంబర్ ను సరి చూసుకోవాలన్నారు. కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకు రసీదు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.

డిజిటల్ పేమెంట్లు, క్యూఆర్ కోడ్, మొబైల్ యాప్ ద్వారా చెల్లింపులు వినియోగదారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతులు విత్తనాలు, మందులు కొనేటప్పుడు బోగస్ కంపెనీల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మోసానికి గురైతే వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేసి తమకు జరిగిన నష్టాన్ని తిరిగి పొందవచ్చు అని తెలిపారు. వినియోగదారులు తూకాలలో మోసపోవద్దని వస్తువు కొనుగోలులో పాటించాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వ్యాపారస్తులు ఉపయోగించే తూనికలు కొలతలు పరికరాలకు సకాలంలో ముద్ర వేయించుకొని లైసెన్స్ తీసుకోవాలని అన్నారు.

ఫుడ్ సేఫ్టీ అధికారులు తరచుగా రెస్టారెంట్లను తనిఖీ చేయాలని ఆదేశించారు. వినియోగదారుల హక్కులను కాపాడేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, వినియోగదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ అధికారి రుక్మిణి, పౌరసరపరాల శాఖ మేనేజర్ త్రినాథ్ బాబు, జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి మనోహర్, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరచారి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, వాలంటరీ ఆర్గనైజర్స్ జూలూరి రఘు రామాచారి, తెలంగాణ కన్జ్యూమర్ సెయింట్ ఇన్ఫర్మేషన్ రైడ్స్ అవేర్నెస్ ఫోరం గుగులోతు బాలు, కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ సభ్యులు మహమ్మద్ రియాజ్,తెలంగాణ కన్స్యూమర్ ఫోరం కొత్తగూడెం సభ్యులు ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed