- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
International Daughters Day: ఇంటికి మహాలక్ష్మిగా భావించే కూతుర్ల దినోత్సవం..
దిశ, వెబ్‌డెస్క్: సెప్టెంబర్‌లోని నాల్గవ ఆదివారం అంతర్జాతీయ కుమార్తెల దినోత్సవంగా జరుపుకుంటారు. ఒకప్పుడు కొంత మంది కూతురు పుడితే అపశకునంగా భావించి చిన్న చూపు చూసి వారిని ఇంటికే పరిమితం చేసేవారు. అలాగే ఆడపిల్ల బయటకు వెళ్లకూడదని.. మగవారికంటే తక్కువగా చూసేవారు. అంతేకాకుండా అమ్మాయికి ఇష్టం వచ్చిన పనులు చేయనిచ్చేవారు కాదు. ఆమె ఎలా ఉండాలన్నా ఇంట్లో వాళ్లు సమాజానికి భయపడి కట్టుబాట్లతో బలి చేసే వారు. ఇష్టమైన బట్టలు వేసుకోకుండా సంప్రదాయంగా ఉండాలని కట్టుబాటు పెట్టేవారు.
అయితే, ప్రస్తుతం టెక్నాలజీ పెరగడంతో కొన్ని కుటుంబాల్లో మార్పులు వస్తున్నాయి. సమాజంలోనూ స్త్రీ, పురుషులకు సమాన హక్కులు వచ్చాయి. అమ్మాయిలు కూడా వారికి నచ్చినట్టు ఉంటూ ఇంటి నుంచి బయటకు వెళ్లి ఉద్యోగాలు చేస్తూ కుటుంబాన్ని పోషించే రోజులు వచ్చాయి. అలాగే కొందరు కూతురిని ఇంటికి మహాలక్ష్మిగా భావించి.. ఆ అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఆమెకు నచ్చిన పనిని చేయిస్తున్నారు. మరి కొంత మంది మాత్రం పాతకాలపు కట్టుబాట్లను పాటిస్తూ కూతురిని భారంగా చూస్తున్నారు. కన్నామా ఏదోలాగ పెంచామా పెళ్లి చేసి అత్తారింటికి పంపించడంతో చేతులు దులుపుకుంటున్నారు.
బాధ్యతలు మరిచిపోయే తమ బిడ్డ ఏం చేయాలనుకుంటుందో ఎలా ఉండాలనుకుంటుందో ఆమెతో ప్రేమగా మాట్లాడ లేక పోతున్నారు. కూతురిని తల్లిగా భావించిన వాళ్లు కొందరైతే.. ఆడపిల్ల అని తెలియగానే చెత్త కుప్పల్లో పడేసే వారు ఎక్కువయ్యారు. ఇంకా కొందరు తండ్రులు మాత్రం ఏకంగా కూతురి మీదనే అత్యాచారం చేసి ఈ బంధానికే కలంకం తీసుకువస్తున్నారు. ఈనాటికీ, కొన్ని సంస్కృతులు ఆడపిల్లలను భారంగా చూస్తున్నాయి. ఆడపిల్లను భారంగా భావించే సంప్రదాయాలను తొలగించడంలో ఈ వేడుక సహాయపడుతుంది. కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటికీ ఈ సంప్రదాయాలను పాటిస్తున్నాయి.
అంతర్జాతీయ డాటర్స్ డేను మొట్టమొదటి సారి అమెరికాలో 1932లో తీసుకువచ్చారు. ఆ తర్వాత ఒక్కో దేశంలో ఒక్కో రోజును జరుపుకోవడం ప్రారంభించారు. భారతదేశంలో మాత్రం దీనిని 2007లో సెప్టెంబర్ నాల్గవ ఆదివారం జరుపుకుంటారు. అసలు దీనిని ఎందుకు తీసుకువచ్చారంటే తల్లిదండ్రులకు కూతురిని ఎలా పెంచాలో అవగాహాన తీసుకువచ్చేందుకు ఈ డేను తీసుకువచ్చారు. సాంస్కృతిక, సామాజిక వ్యక్తిగత విశ్వాసాలపై ఆధారపడి, వేర్వేరు వ్యక్తులు వివిధ కారణాల కోసం కుమార్తెల దినోత్సవాన్ని జరుపుకోవచ్చు. ఈ రోజు బాలికలకు అదనపు అవకాశాలను ప్రోత్సహిస్తుంది. బాలికలు వారి లింగం ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా బాధపడుతున్న లింగ అసమతుల్యతపై అవగాహనను పెంచుతుంది. ఆరోగ్య సంరక్షణ, చట్టపరమైన హక్కులు, పోషకాహారం, వివక్షకు వ్యతిరేకంగా రక్షణ, మహిళలపై హింస బలవంతపు బాల్య వివాహాలు అసమానత ఉన్న ప్రాంతాలకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఈ రోజు మార్కింగ్, అభివృద్ధి విధానం, ప్రోగ్రామింగ్, ప్రచారం పరిశోధనలలో ఒక ప్రత్యేక సమూహంగా బాలికలు, యువతుల విజయవంతమైన ఆవిర్భావాన్ని ప్రతిబింబిస్తుంది.