- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంచులో కూరుకుపోయిన వ్యక్తిని కాపాడిన సంచలన వీడియో
దిశ, వెబ్‌డెస్క్: మనిషి ప్రాణం పోతున్న చుస్తూ.. పట్టించుకొని ప్రస్తుత సమాజం ఇది. అలాంటిది మంచులో కూరుకుపోయి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఓ వ్యక్తి, మరో వ్యక్తికి కాపాడిన సంఘటన వాషింగ్టన్ నార్త్ వెస్ట్‌లోని మౌంట్ బేకర్ స్కీ ఏరియాలో చోటు చేసుకుంది. ఫ్రాన్సిస్ జుబేర్ ఆనే వ్యక్తి ఆ ఏరియా గుండా రైడింగ్ చేస్తూ కిందికి వెళ్తున్న సమయంలో ఓ చెట్టు వద్ద మంచులో నుంచి స్నోబోర్డ్ బయటకు కనిపించింది. దీంతో అతనికి అనుమానం వచ్చి ఆగాడు. ఆ మంచులో ఎవరో కూరుకుపోయి ఉంటారని ఊహించి.. గట్టిగా కేకలు వేశాడు. అయినా స్పందించకపోవడంతో వెంటనే అతి వేగంగా చేతులతోనే మంచు పక్కకు తవ్వి పోశాడు.
ఇలా తీస్తుండగా ఓ వ్యక్తి చేతులు కనిపించాయి. ‘‘ ఎలా ఉన్నావు? గాలి ఆడుతుందా అంటూ మళ్లీ కేకలు పెట్టాడు. అతడి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. మళ్లీ ఆ వ్యక్తి ముఖం వరకు తవ్వి.. నోటి నుంచి మంచును తొలగించి, శ్వాస తీసుకునేలా చేశాడు. ఆ తర్వాత మంచును తోడే షాల్‌ను ఉపయోగించి వేగంగా మంచును తొలగించి.. ఆ వ్యక్తిని బయటకు తీశాడు. అతడి తలకు బిగించిన క్యామెరా ఈ నాటకీయ విజువల్స్ క్యాప్చర్ చేసింది. బాధితుడిని ఇయాన్ స్టేజర్‌గా గుర్తించారు. కొద్ది నిమిషాల్లో ప్రాణాలు పోతున్న ఇయాన్‌ను కాపాడిన ఫ్రాన్సిస్‌పై నెటిజన్లు తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
This man is a HERO‼️ Francis Zuber ‘s headcam shows him rescuing a snowboarder who was buried head down in deep powder at Mt. Baker, Washington! Luckily, he spotted him as he almost passed him. #skiing #snowboarding pic.twitter.com/SyWYFSXcPd
— DeL2000 (@DeL2000) April 1, 2023