సౌది అరేబియా సిగలో మరో అద్భుత కట్టడం

by Javid Pasha |   ( Updated:2023-02-22 03:14:47.0  )
సౌది అరేబియా సిగలో మరో అద్భుత కట్టడం
X

దిశ, వెబ్ డెస్క్: ఇప్పటికే జెడ్డా టవర్, కింగ్ డమ్ సెంటర్, బుర్జ్ రఫాల్ వంటి ఎన్నో అద్భుతమైన కట్టడాలను నిర్మించిన సౌది అరేబియా తాజాగా మరో అద్భుతమైన కట్టడాన్ని నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. దేశ రాజధాని రియాధ్ లో400 మీటర్ల ఎత్తైన 'ది ముకాబ్' అనే కట్టడాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపింది. ఈ నిర్మాణంతో రియాధ్ స్వరూపం పూర్తిగా మారనుందని సౌది అరేబియా ప్రభుత్వం తెలిపింది. ముకాబ్ పేరుతో పిలిచే ఈ మెగా ప్రాజెక్ట్ కు సంబంధించిన ఓ ప్రమోషనల్ వీడియోను అక్కడి ప్రభుత్వం విడుదల చేసింది. ఆ వీడియోలోని దృశ్యాల ప్రకారం.. లోతైన క్యూబ్ ఆకారంలో పెద్ద నిర్మాణాన్ని కడుతున్నారు. ఇది న్యూయార్క్ లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కంటే 20 రెట్లు పెద్దదిగా ఉంటుంది.

ఈ మెగా ప్రాజెక్టులో ఒక మ్యూజియం, టెక్నాలజీ అండ్ డిజైన్ యూనివర్సిటీ, మల్టి పర్పస్ థియేటర్, 80 పైగా ఎంటర్ టైన్ మెంట్ మరియు కల్చరల్ సెంటర్స్ ఉండనున్నట్లు అరబ్ న్యూస్ తెలిపింది. ఈ న్యూ మురబ్బాలో 25 మిలియన్ చదరపు కిలోమీటర్ల ఫ్లోరింగ్, లక్షా 4 వేల నివాస గృహాలు, 9 వేల హోటల్ గదులు, 9 లక్షల 80 వేల మీటర్ల షాపింగ్ కాంప్లెక్స్, 1.4 మిలియన్ చదరపు మీటర్ల ఆఫీస్ స్పేస్, 6 లక్షల 20 వేల లీజర్ అస్సెట్స్, 1.8 మిలియన్ చదరపు మీటర్ల స్థలాన్ని కమ్యూనిటీ వసతుల కోసం వినియోగించనున్నట్లు పేర్కొంది. ఈ కొత్త నిర్మాణం నుంచి ఎయిర్ పోర్టు కు పోవడానికి కేవలం 20 నిమిషాల పడుతుందని చెప్పింది. 2030 వరకు ఈ మెగా ప్రాజెక్టును పూర్తి చేయనున్నట్లు సౌది అరేబియా ప్రభుత్వం ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed