- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైతీ ప్రధాని రాజీనామా..కారణమిదే?
దిశ, నేషనల్ బ్యూరో: హైతీలో ముఠా హింస పెరుగుతుండటంతో ప్రధాన మంత్రి ఏరియల్ హెన్రీ రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆ దేశ కరీబియన్ కమ్యూనిటీ చైర్ ఇర్ఫాన్ అలీ వెల్లడించారు. ఆయన రాజీనామాను ఆమోదించామని తాత్కాలిక పీఎంను నియమించేందుకు దృష్టి సారించినట్టు తెలిపారు. హైతీలో పరిస్థితులపై చర్చించడానికి ప్రాంతీయ నాయకులు జమైకాలో సమావేశమైన నేపథ్యంలోనే హెన్రీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 2021 నుంచి హెన్రీ హైతీ పీఎంగా బాధ్యతల్లో ఉన్నాడు. కాగా, ఇటీవల హైతీ సాయుధ మూకల దాడులతో అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. ఈ దాడుల నేపథ్యంలో అమెరికా, హైతీ విమానయాన సంస్థలు పలు విమాన సర్వీసులను రద్దు చేశాయి.
రక్షణ ఒప్పందం నిమిత్తం ప్రధాని ఏరియెల్ గత నెల కెన్యా పర్యటనకు వెళ్లారు. ఆ టైంలో దేశ రాజధాని పోర్ట్-ఓ-ప్రిన్స్‌లో సాయుధ ముఠాలు రెచ్చిపోయారు. అనేక చోట్ల దాడులకు పాల్పడ్డారు. దేశంలో అత్యంత తీవ్రమైన నేరస్థులను ఉంచే పోర్టు ఓ ప్రిన్స్ జైలు పైన దాడులు చేయగా..ఆ జైలులో ఉన్న నాలుగు వేల మంది ఖైదీలు తప్పించుకున్నారు. దీంతో దేశంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనేక మంది ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. దాదాపు 3,62,000 మంది తమ ఇళ్లను వదిలిపెట్టి పారిపోయారు. పోలీసు స్టేషన్లను ఆక్రమించుకునేందుకు దుండగులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీంతో ఏరియెల్ రాజీనామా చేయాలని డిమాండ్లు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆయన పదవికి రిజైన్ చేశారు.
కాగా, లాటిన్ అమెరికాలో అత్యంత పేద దేశం హైతీ. ఈ దేశంలో ఒక కోటి 14లక్షల జనాభా కలిగి ఉంటుంది. 2021లో దేశ అధ్యక్షుడు జోవెనెల్ మోయిస్ హత్యకు గురైనప్పటి నుంచి దేశంలో అస్థిరత నెలకొంది. అప్పటి నుంచి దేశంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడో చోట సాయుధ మూకలు నిరంతరం రెచ్చిపోతూనే ఉన్నారు. గతేడాది జరిగిన హింసలోనూ సుమారు 8000 మందికిపైగా మరణించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం హైతీలో నెలకొన్ని పరిస్థితులను చక్కదిద్దేందుకు అమెరికా, ఐక్యరాజ్యసమితి ప్రయత్నిస్తున్నాయి.