క్వీన్ ఎలిజబెత్-2 ఆరోగ్యం విషమం

by srinivas |   ( Updated:2022-09-08 15:05:33.0  )
క్వీన్ ఎలిజబెత్-2 ఆరోగ్యం విషమం
X

లండన్: బ్రిటన్ క్వీన్ ఎలిజెబెత్-2 ఆరోగ్యం క్షీణించింది. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె మెడికల్ పర్యవేక్షణలో ఉన్నట్లు బంకింగ్‌హమ్ ప్యాలెస్ గురువారం ప్రకటనలో తెలిపింది. గత ఏడాది అక్టోబర్ నెల నుంచి తీవ్ర ఆరోగ్య సమస్యలతో ఆమె నడవడం, నిల్చోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఆరోగ్యపరిస్థితి తెలుసుకుని కుటుంబ సభ్యులు వెంటనే బయలుదేరారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ నూతన ప్రధాని లిజ్ ట్రస్ ట్వీట్ చేశారు. బంకింగ్‌హం ప్యాలెస్ ప్రకటనతో దేశం మొత్తం ఆందోళన చెందిందని పేర్కొన్నారు. కాగా, మంగళవారమే ట్రస్ క్వీన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ తర్వాత ఎలిజబెత్ ట్రస్‌ను ప్రధానిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. లండన్ నగర్ మేయర్ సాదిక్ ఖాన్ కూడా క్వీన్ ఆరోగ్యపరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. బుధవారం సీనియర్ రాజకీయ సలహాదారులతో సమావేశం కావాల్సి ఉండగా, ఆరోగ్య పరిస్థితుల కారణంగా రద్దైంది.

Advertisement
Next Story

Most Viewed