పెరుగుతున్న ఉపగ్రహాలతో అయస్కాంత క్షేత్రానికి భారీ ముప్పు

by Disha Web Desk 17 |
పెరుగుతున్న ఉపగ్రహాలతో అయస్కాంత క్షేత్రానికి భారీ ముప్పు
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు తమ అవసరాల కోసం భూమి వాతావరణంలో శాటిలైట్ ఉపగ్రహాలు పంపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణంలో వీటి సంఖ్య పెరుగుతుండటం వలన మానవ మనుగడకు భారీ ముప్పు ఉంటుందని భౌతిక శాస్త్రవేత్త సియెర్రా సోల్టర్ హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అయస్కాంత క్షేత్రానికి అంతరాయం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. అయానోస్పియర్, మాగ్నెటోస్పియర్‌లో పేరుకుపోయిన ఉపగ్రహాలను కాల్చడం వల్ల ఏర్పడే దుమ్ము, బూడిద భూమి అయస్కాంత క్షేత్రాన్ని బలహీనపరిచేలా చేయగలవని సోల్టర్ తెలిపారు. ఏడాది పాటు ఈ సమస్యల గురించి ఆయన పరిశోధన చేశారు.

భూమి పైన ఉన్న వాతావరణం చాలా ముఖ్యమైనది, అయస్కాంత క్షేత్రం భూమిని హానికరమైన సౌర వికిరణం నుండి రక్షిస్తుంది. అయితే ఉపగ్రహాల నుంచి వస్తున్న చెత్త ద్వారా వాతావరణానికి ప్రమాదం పొంచి ఉంది. అయానోస్పియర్‌లోని ప్రస్తుత చెత్త భారీ మొత్తంలో పేరుకుపోయింది. రాబోయే 10 ఏళ్లలో పెనీలు పదివేల ఉపగ్రహాలను ప్రయోగించాలని చూస్తున్నందున, అయస్కాంత గోళంపై పడే ప్రభావాన్ని కూడా పరిగణించాలని, అంతరిక్ష సంస్థలు తమ ఉపగ్రహాలను ప్రయోగించే ముందు వాటి పర్యావరణ ప్రభావాన్ని అధ్యయనం చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. పెరుగుతున్న అంతరిక్ష కాలుష్యాన్ని తగ్గించడానికి అందరూ తోడ్పడాలని సోల్టర్ పేర్కొన్నారు.



Next Story

Most Viewed