వచ్చే ఏడాది జనవరిలో పాక్‌లో ఎన్నికలు..

by Vinod kumar |
వచ్చే ఏడాది జనవరిలో పాక్‌లో ఎన్నికలు..
X

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే దానిపై క్లారిటీ వచ్చింది. వచ్చే ఏడాది జనవరి చివరి వారంలో ఎలక్షన్స్ నిర్వహిస్తామని పాకిస్థాన్ ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల ప్రచారం చేసుకునేందుకు పార్టీలకు దాదాపు 54 రోజుల టైం ఇచ్చేలా షెడ్యూల్ ను విడుదల చేస్తామని తెలిపింది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఇప్పటికే పూర్తయినందున, సెప్టెంబర్ 27న తొలి జాబితాను విడుదల చేస్తామని పేర్కొంది. ప్రాథమిక జాబితాపై అభ్యంతరాల స్వీకరణ తర్వాత నవంబర్‌ 30న తుది జాబితాను విడుదల చేస్తామని వెల్లడించింది. ఆగస్టు 9నే పాక్ నేషనల్ అసెంబ్లీ రద్దయిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story