North Korea :కిమ్ జాంగ్ కూతురి పేరిట స్టాంపులు

by Javid Pasha |   ( Updated:2023-02-15 11:28:58.0  )
North Korea :కిమ్ జాంగ్ కూతురి పేరిట స్టాంపులు
X

ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియాలో గత కొన్ని రోజులుగా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కూతురు బయటకు కనిపించడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. కిమ్ అనారోగ్య కారణాలున్నాయని ఆరోపిస్తూ తన కూతురిని వారుసురాలిగా ప్రకటించించనున్నట్లు పలు అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో కొరియా ప్రభుత్వం చేసిన పని ఆ వార్తలకు మరింత ఊపునిచ్చింది. తాజాగా కిమ్ జాంగ్ ఉన్ కూతురు ఉన్నటువంటి పోస్టేజ్ స్టాంపులను అవిష్కరించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో తర్వాత ప్రెసిడెంట్‌గా కూతురు ప్రకటిస్తారనే వార్తలకు బలం చేకూరింది. గత నాలుగైదు నెలలుగా తన కూతురితో పాటు కిమ్ జాంగ్ ఉన్ కీలక కార్యక్రమాలకు హజరవుతున్న సంగతి తెలిసిందే.

గతేడాది నవంబర్ బాలిస్టిక్ మిసైల్ ప్రయోగ సమయంలో తన కూతురుతో కలిసి కిమ్ వచ్చారు. ఆ తర్వాత కూడా ఆర్మీతో కలసి చర్చల సమయంలోనూ కూతురితో ఉన్న ఫోటోలు వైరల్‌గా మారాయి. అయితే ఆమె పేరును మాత్రం ఇప్పటివరకు బయట పెట్టలేదు. కిమ్ రెండో కూతురని దక్షిణకొరియా స్పై ఏజెన్సీ భావిస్తోంది. కొరియా స్టాంప్ కార్పొరేషన్ తన వెబ్‌సైట్‌లోని కిమ్ 'ప్రియమైన కుమార్తె'గా అభివర్ణించింది. ఈ సిరీస్ శుక్రవారం విడుదల కానుంది. ఈ స్టాంప్‌ల విడుదలతో ప్రపంచానికి తన వారసురాలిని కిమ్ ప్రకటిస్తున్నారని అంతర్జాతీయ పరిశోధకులు పేర్కొన్నారు.

Advertisement

Next Story