- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైద్యశాస్త్రంలో ఇద్దరకి నోబెల్ బహుమతి
X
దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ బహుమతుల(Nobel prizes 2024) ప్రకటన సోమవారం నుండి మొదలైంది. నేడు వైద్యశాస్త్రంలో చేసిన అసాధారణ పరిశోధనకు గాను ఇద్దరు అమెరికన్ డాక్టర్లకు నోబెల్ బహుమతి ప్రకటించారు. విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రవ్కూన్ అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికయ్యారు. జన్యు కార్యకలాపాలను నియంత్రించే ప్రాథమిక సూత్రమైన మైక్రో ఆర్ఎన్ఏ.. పోస్ట్ ట్రాన్స్ స్క్రిప్షనల్ జీన్ రెగ్యులేషన్ లో దాని పాత్రపై చేసిన పరిశోధనల్లో వీరిరువురికి నోబెల్ పురస్కారం అందిస్తున్నట్టు స్వీడన్ లోని నోబెల్ బృందం సోమవారం ప్రకటించింది. కాగా ఇప్పటివరకు వైద్యశాస్త్రంలో 227 మంది నోబెల్ బహుమతి అందుకున్నారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్దంతి రోజైన డిసెంబర్ 10న జరిగే వేడుకల్లో గ్రహీతలకు బహుమతితో పాటు, లక్ష డాలర్లను అందజేస్తారు.
Advertisement
Next Story