NASA : బోయింగ్ ‘స్టార్ లైనర్’ నుంచి విచిత్రమైన సౌండ్స్.. మిస్టరీ గుట్టువిప్పిన నాసా

by Hajipasha |
NASA : బోయింగ్ ‘స్టార్ లైనర్’ నుంచి విచిత్రమైన సౌండ్స్.. మిస్టరీ గుట్టువిప్పిన నాసా
X

దిశ, నేషనల్ బ్యూరో : భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌ను జూన్ 5న అంతరిక్షంలోకి తీసుకెళ్లిన బోయింగ్ కంపెనీ స్పేస్‌క్రాఫ్ట్ ‘స్టార్ లైనర్’ ప్రస్తుతం పనిచేయడం లేదు. దీంతో దాన్ని నడి ఆకాశంలో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) అటాచ్ చేశారు. జూన్ నుంచి ఇప్పటివరకు సునీతా విలియమ్స్, అమెరికన్ వ్యోమగామి బ్యారీ బుచ్ విల్మోర్ స్టార్ లైనర్‌లోనే ఉన్నారు గత కొన్ని రోజులుగా స్టార్ లైనర్ నుంచి విచిత్రమైన సౌండ్స్ వస్తున్నాయి. ఇంతకీ అవేమిటో బోయింగ్ కంపెనీ కమాండ్ కంట్రోల్ సెంటరుకు అంతుచిక్కలేదు. దీంతో రంగంలోకి దిగిన నాసా శాస్త్రవేత్తలు అసలు మిస్టరీ ఏమిటో గుర్తించారు. స్పేస్ క్రాఫ్ట్‌ లోపల అమర్చి ఉన్న స్పీకర్ నుంచే ఆ సౌండ్స్ వస్తున్నట్లు వెల్లడించారు.

స్టార్ లైనర్ వ్యోమనౌక, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం మధ్య ఆడియో కన్ఫిగరేషన్ సమస్య వల్ల అలాంటి విచిత్రమైన సౌండ్స్ వస్తున్నాయని నాసా తెలిపింది. స్పేస్ క్రాఫ్ట్‌కు ఈ సౌండ్స్ వల్ల ఎలాంటి రిస్కూ లేదని తేల్చి చెప్పింది. 2025 సంవత్సరం ఫిబ్రవరిలో సునీతా విలియమ్స్, బ్యారీ బుచ్ విల్మోర్‌లు స్పేస్ ఎక్స్ కంపెనీకి చెందిన డ్రాగన్ క్యాప్సూల్‌లో భూమికి తిరిగి రానున్నారు. అప్పటివరకు వారిద్దరు స్టార్ లైనర్‌లోనే ఉంటారు.

Advertisement

Next Story