అగ్రరాజ్యాన్ని వణికిస్తోన్న హరికేన్ "మిల్టన్".. చిక్కుకున్న మిస్ పిగ్గీ

by Y.Nagarani |
అగ్రరాజ్యాన్ని వణికిస్తోన్న హరికేన్ మిల్టన్.. చిక్కుకున్న మిస్ పిగ్గీ
X

దిశ, వెబ్ డెస్క్: అగ్రరాజ్యమైన అమెరికాను హరికేన్ "మిల్టన్" (hurricane milton) వణికిస్తోంది. ఫ్లోరిడా (florida)పై దీని ప్రభావం అధికంగా ఉందని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే దీనిని కేటగిరి 5 తుపానుగా ప్రకటించారు అధికారులు. ప్రచండ గాలులతో కూడిన భీకర వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. నేషనల్ హరికెన్ సెంటర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈరోజు అర్థరాత్రి 2 గంటల నుంచి 3 గంటల సమయంలో హరికేన్ ఫ్లోరిడాకు సమీపంలోని సరసొట వద్ద మిల్టన్ హరికేన్ తీరం దాటనుంది. మిల్టన్ హరికేన్ అతితీవ్రమైనదని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని బైడెన్ ప్రభుత్వం హెచ్చరించింది. ఫ్లోరిడా పశ్చిమం నుంచి తూర్పు వరకూ ఉన్న తీరప్రాంతంపై హరికేన్ ప్రభావం చూపుతోంది. అక్కడున్నవారంతా నివాసప్రాంతాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.

హరికేన్ కారణంగా.. కొన్నిప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యానికి అంతరాయం ఏర్పడింది. దీంతో అక్కడి వాతావరణ పరిస్థితి ఎలా ఉందన్న సమాచారం తెలియక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా నార్త్ కరోలినా, టెన్నెస్సీ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. గడిచిన రెండు వారాల్లో ఫ్లోరిడాలో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించడం ఇది రెండవసారి అని స్థానిక మీడియా వర్గాలు పేర్కొన్నాయి. హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ సెక్రటరీ గ్జావియెర్ బెసెర్ర హెల్త్ ఎమర్జెన్సీపై కీలక ప్రకటన చేశారు. హరికేనె కారణంగా తీవ్ర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. లోకల్ హెల్త్ అధికారులతో ప్రజలకు మందులు పంపిణీ చేసే విషయమై సంప్రదించామని, త్వరలోనే మెడికల్ సపోర్ట్ అందజేస్తామని తెలిపారు.

కాగా.. హరికేన్ ప్రభావిత ప్రాంతంలో ఒక పరిశోధన విమానం.. ప్రమాదవశాత్తు దూసుకెళ్లింది. ఎన్ఓఏఏ(NOAA) ఎయిర్ క్రాఫ్ట్స్ ఆపరేషన్ సెంటర్ అందుకు సంబంధించిన వీడియోను నెట్టింట షేర్ చేయగా.. అదికాస్తా వైరల్ అయింది. మిస్ పిగ్గీ లాక్ హీడ్ wp-3D ఓరియన్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదవశాత్తూ హరికేన్ లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో విమానంలో నలుగురు రీసెర్చర్లు ఉన్నట్లు NOAA పేర్కొంది. తుపాను ధాటికి తమ సిబ్బంది ఉన్న విమానం కుదుపులకు గురైందని, చివరికి తమ సిబ్బంది సురక్షితంగానే ఉన్నట్లు తెలిపింది. కాగా.. ఈ తుపాను గడిచిన వందేళ్లలో అమెరికా ఎదుర్కొన్న అత్యంత ప్రమాదకరమైన తుపాన్లలో ఒకటి కావొచ్చని సంచలన ప్రకటన చేశారు.

Advertisement

Next Story

Most Viewed