- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Global IT Outage : బగ్‌ను గుర్తించి వేరుచేశాం.. ఇష్యూ ఫిక్సయింది : క్రౌడ్ స్ట్రైక్ సీఈఓ
దిశ, నేషనల్ బ్యూరో : మైక్రోసాఫ్ట్‌కు సైబర్ సెక్యూరిటీ సేవలు అందించే క్రౌడ్ స్ట్రైక్ కంపెనీ ఇచ్చిన ఒక కొత్త అప్‌డేట్ కారణంగా మైక్రోసాఫ్ట్ సర్వర్‌లలో శుక్రవారం సమస్య తలెత్తింది. మైక్రోసాఫ్ట్ బ్లూ స్క్రీన్ ఎర్రర్‌ను చాలా రంగాల సంస్థలు ఎదుర్కొన్నాయి. ఈ వ్యవహారంపై క్రౌడ్ స్ట్రైక్ కంపెనీ సీఈఓ జార్జ్ కర్ట్జ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. విండోస్ హోస్ట్‌ల కోసం సింగిల్ కంటెంట్ అప్‌డేట్‌లో సాంకేతిక లోపం కారణంగా మైక్రోసాఫ్ట్ బ్లూ స్క్రీన్ ఎర్రర్ వచ్చిందన్నారు. దీనివల్ల ప్రభావితమైన కస్టమర్లకు సహాయం చేయడంపై తమ కంపెనీ ఫోకస్ పెట్టిందన్నారు. ఈ ఎర్రర్ వల్ల మ్యాక్, లైనెక్స్ హోస్ట్‌లు ప్రభావితం కావు అని స్పష్టం చేశారు. ‘‘ఇది సైబర్ దాడి కానే కాదు.. కేవలం ఒక బగ్ ఇష్యూ’’ అని జార్జ్ కర్ట్జ్ తేల్చిచెప్పారు.
‘‘ఒక బగ్ సమస్యను గుర్తించాం.. దాన్ని సెపరేట్ చేశాం.. ఇష్యూ ఫిక్స్ చేశాం’’ అని ఆయన వెల్లడించారు. లేటెస్ట్ అప్‌డేట్‌ల కోసం తమ కస్టమర్ సపోర్ట్ పోర్టల్‌ను విజిట్ చేయాలని కోరారు. తమ వెబ్‌సైట్‌లోనూ ఫుల్ అప్‌డేట్స్ అందిస్తున్నామని తెలిపారు. ఓ మీడియా సంస్థకు క్రౌడ్ స్ట్రైక్ సీఈఓ జార్జ్ కర్ట్జ్ ఇంటర్వ్యూ ఇస్తూ.. ఎన్నో రంగాల పరిశ్రమలకు అంతరాయాన్ని కలిగించిన ఈ టెక్ వైఫల్యానికి క్షమాపణలు చెప్పారు. చాలా మంది కస్టమర్లు సిస్టమ్‌ను రీబూట్ చేస్తున్నారని.. ఇప్పుడు సర్వర్ బాగానే పనిచేస్తోందన్నారు. అయితే కొన్ని సిస్టమ్‌లలో అప్‌డేట్ పూర్తికావడానికి కొంతటైం పట్టొచ్చని పేర్కొన్నారు.