- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమాణిక దాడి: 10 మంది పౌరుల మృతి !
దిశ, నేషనల్ బ్యూరో: లెబనాన్‌పై ఇజ్రాయెల్ చేసిన వైమాణిక దాడిలో మరణించిన వారి సంఖ్య 10కి చేరినట్టు లెబనీస్ స్టేట్ మీడియా గురువారం తెలిపింది. దక్షిణ లెబనాన్‌లోని అనేక విభిన్న ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని ఈ అటాక్‌కు పాల్పడినట్టు పేర్కొంది. దీంతో నబాతియేహ్‌లో సిటీలో ఓ భవనంలో కొంత భాగం నేలకూలగా.. ఒక చిన్నారితో సహా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులు మరణించినట్టు తెలుస్తోంది. మరి కొందరికి తీవ్ర గాయాలైనట్టు సమాచారం. మొత్తంగా ఆరుగురు మహిళలు, ముగ్గురు పిల్లలతో సహా పది మంది మృతి చెందినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. వీటికి నిరసనగా లెబనాన్‌లో ప్రభుత్వ సంస్థలు, పాఠశాలలు మూసివేశారు. ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని లెబనీస్ మిలిటెంట్ గ్రూప్ హిజ్భుల్లా హెచ్చరించింది. కాగా,ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి లెబనీస్ మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా ఇజ్రాయెల్ దళాలతో హమాస్‌కు మద్దతుగా దాదాపు రోజువారీ కాల్పులు జరుపుతోంది. దీంతో ఇజ్రాయెల్- లెబనాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.ఈ హింసలో దాదాపు 247 మంది లెబనాన్ పౌరులు కూడా మరణించినట్టు తెలుస్తోంది. అలాగే హిజ్బుల్లా గ్రూపు సభ్యులు 34 మరణించినట్టు ఇజ్రాయెల్ చెబుతోంది.