ప్రమాదమా..ప్రణాళికా?: ఇరాన్ అధ్యక్షుడి మృతిపై అనుమానాలు

by samatah |
ప్రమాదమా..ప్రణాళికా?: ఇరాన్ అధ్యక్షుడి మృతిపై అనుమానాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: విమాన ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి అమీర్ అబ్దుల్లాహియాన్‌లు మరణించారు. ఈ విషయాన్ని ఆదేశ అధికారిక మీడియా ధ్రువీకరించింది. అయితే ఇద్దరు శక్తి వంతమైన ఇరాన్ నాయకులు అనూహ్యంగా ఒకే సారి మరణించడంతో ప్రమాదంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ క్రాష్ అయినట్టు స్థానిక కథనాలు వెల్లడించినా.. విమానాన్ని క్రాష్ చేయడంలో విదేశీ శత్రువుల ప్రమేయం ఏమైనా ఉందా అనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే అజర్‌ బైజాన్ నుంచి తిరుగు ప్రయాణంలో రైసీ ప్రయాణిస్తున్న విమానంతో పాటు వారికి రక్షణగా మరో రెండు విమానాలు వెళ్లాయి. అందులో కేవలం రైసీ ప్రయాణిస్తున్న విమానం మాత్రమే ప్రమాదానికి గురికాగా..మిగతా హెలికాప్టర్లు సురక్షితంగానే ఉన్నాయి. దీంతో ఘటన వెనుక కుట్ర కోణం ఏమైనా ఉందా అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఇటీవల ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి చేయగా..అందుకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ నేపథ్యంలోనే ప్రమాదం జరగడం కూడా అనుమానాలను పెంచుతోంది.

అమెరికా కుట్ర?

రైసీ ప్రమాదానికి అమెరికా ఏమైనా కుట్ర చేసిందా అని మరికొందరు భావిస్తున్నారు. ఎందుకంటే ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ సమయంలో అమెరికా కలుగజేసుకుంది. ఇజ్రాయెల్ పై దాడి చేయొద్దని ఇరాన్‌కు సూచించింది. అయినప్పటికీ ఇరాన్ పట్టించుకోకుండా దాడికి పాల్పడి..అమెరికాకే తిరిగి వార్నింగ్ ఇచ్చింది. అవసరమైతే యూఎస్ పైనా దాడి చేస్తామని తెలిపింది. అనంతరం అమెరికా ఇరాన్ పై ఆంక్షలు విధించింది. అంతేగాక రైసీ ప్రయాణిస్తున్న విమానం కూడా అమెరికా తయారు చేసిన ‘బెల్ 212’ హెలికాప్టర్‌ కావడం గమనార్హం. దీంతో రైసీ మృతికి యూఎస్ ఏమైనా కుట్ర చేసిందా? అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఒకవేళ ఈ ప్రమాదం వెనుక అమెరికా ఉందని తేలితే ఇరాన్ ఎలా స్పందిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

పైలట్ ‘మొసాద్’ ఏజెంట్!

ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తు్న్న విమానాన్ని నడిపిన పైలట్ ఇజ్రాయెల్ గూఢచార సంస్థ ‘మొసాద్’కు ఏజెంట్ అని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇరాన్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా రహస్య కార్యకలాపాలకు పేరుగాంచిన మొసాద్ గతంలోనూ పలు ఘటనల్లో ప్రమేయం కలిగి ఉంది. దీంతో ఇజ్రాయెల్ ఏమైనా ప్రతీకార చర్యలకు పాల్పడిందా అనే అనుమానం కలుగుతోంది. అయితే ఒక దేశ అధ్యక్షుడిని చంపేంత సాహసం ఎవరూ చేసి ఉండకపోవచ్చని, దేశాధినేతను హత్య చేయడం అంటే ప్రత్యక్ష యుద్ధాన్ని ప్రోత్సహించడమేనని పలువురు భావిస్తున్నారు. అయితే కుట్ర కథనాలపై ఇరాన్ అధికారికంగా స్పందించలేదు.

Advertisement

Next Story

Most Viewed