- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ireland | డైలీ కస్టమర్‌కు జీవిత కాలం గుర్తుండిపోయేలా గిఫ్ట్ ఇచ్చిన రెస్టారెంట్!.. అదేమిటంటే..
దిశ వెబ్ డెస్క్ : మనలో చాలా మంది భోజన ప్రియులు ఉంటారు. కొందరు ఇంట్లో తయారు చేసిన ఆహారాన్నే తినాలనుకుంటారు. కానీ కొందరికి ఆ వెసులుబాటు లేక హోటల్స్ లో తింటూ ఉంటారు. అలా హోటల్స్ లో తినేవారు కొందరు ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఫుడ్ రుచి చూసేవారు కూడా ఉంటారు. కానీ కొందరు మాత్రం ఒకే చోట ఫుడ్ తినడానికి ఇష్టపడతారు. ఎందుకంటే వారు రోజూ అదే వంటకం అదే రుచిని కోరుకుంటారు.
అలాంటి ఒక వృద్ధుడు కూడా ప్రతిరోజూ ఒకే రెస్టారెంట్‌కు వెళ్లి.. ఒకే రకమైన ఫుడ్ ఆర్డర్ చేసేవాడు. అతని పేరు జాన్. రోజూ ఉదయాన్నే జాన్ తన ఇంటి సమీపంలో ఉన్న 'గ్రాంగెకాన్ కిచెన్' అనే రెస్టారెంట్ వద్దకు వెళ్లి ఒకే రకమైన బ్రేకఫాస్ట్ తినేవాడు.అది గమనింమిన హోటల్ యజమాన్యం అతనికి ఒక తీయని అనుభూతిని గిఫ్ట్‌గా ఇచ్చింది. ఆ గిఫ్ట్ గురించి తెలిసిన జాన్ ముఖంలో సంతోషం వెల్లివెరిసింది.
ఆ గిఫ్ట్ ఏమిటంటే.. జాన్ తినే వంటకానికి అతని పేరే పెట్టారు. ఆ వంటకానికి జాన్స్ బ్రేక్‌ఫాస్ట్ అనే పేరు పెట్టారు. మెనూలో జాన్స్ బ్రేక్‌ఫాస్ట్ అని వస్తుంది. కస్టమర్లు ఆర్డర్ చేసినప్పుడు రసీదు కూడా జాన్ పేరు మీదే ఇవ్వడం విశేషం. ఈ సంఘటన ఐర్లాండ్ దేశంలో జరిగింది. గ్రాంగెకాన్ కిచెన్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో జాన్ గురించి ఒక వీడియో షేర్ చేశారు. అది ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది.
పరిచయం లేని వారు ప్రతిరోజూ మనకు కనబడుతుంటే అలాంటి వారితో మనకు ఒక రకమైన మానవ సంబంధం ఏర్పడుతుంది. వారి పట్ల కాస్త స్నేహ భావం చూపిస్తే.. ఆ అపరిచితులు కూడా స్నేహితులుగా మారిపోతారు. జాన్ పట్ల రెస్టారెంట్ యాజమాన్యం చూపించిన అభిమానం కూడా అలాంటిదే.