- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
ప్లీజ్.. భోజనం, కాఫీ బ్రేక్‌లో శృంగారంలో పాల్గొనండి
దిశ, నేషనల్ బ్యూరో : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. దేశంలో జననాల రేటు పడిపోతుండటంతో ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. సంతానోత్పత్తిని పెంచేందుకు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. రష్యన్ ప్రజలు పనివేళల్లో భోజన విరామం, కాఫీ బ్రేక్‌లో శృంగారంలో పాల్గొని దేశ జనా భా రేటు క్షీణతను తగ్గించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారి తీశాయి. ఇదిలాఉండగా, రష్యాలో సంతానోత్పత్తి రేటు ప్రస్తుతం ఒక మహిళకు 1.5 మంది పిల్లలు మాత్రమే ఉన్నారు. స్థిరమైన జనాభా కోసం అవసరమైన 2.1 రేటు కంటే తక్కువగా ఉంది. పుతిన్ గతంలో జనాభా పెరుగుదల యొక్క ఆవశ్యకతను ఎత్తిచూపారు.
‘రష్యన్ ప్రజల సంరక్షణ మా అత్యధిక జాతీయ ప్రాధాన్యత. రష్యా యొక్క విధి.. మనలో ఎంతమంది ఉంటారనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇది జాతీయ ప్రాముఖ్యత యొక్క ప్రశ్న’ అని చెప్పుకొచ్చారు. అయితే, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వలన 10 లక్షలకు పైగా యువకులు దేశాన్ని వీడినట్లు సమాచారం. దీంతో పుతిన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశంలో తగ్గుతున్న సంతానోత్పత్తిపై ఆరోగ్య మంత్రి డాక్టర్ యెవ్జెనీ షెస్టోపలోవ్ స్పందిస్తూ.. ప్రజలు కుటుంబాలను ప్రారంభించకుండా నిరోధించే వాదనను ఆయన తోసిపుచ్చారు. ‘జీవితం చాలా త్వరగా ముగుస్తుంది’ అని చెప్పారు. అందుకే 12 నుంచి 14 గంటలు పని చేసేవారు కూడా తమకు ఉన్న విరామ సమయాన్ని సంతానోత్పత్తి పెంచడానికి ఉపయోగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఇక 1999 జూన్ నెలలో 1,00,000 తక్కువగా జననాలు రష్యాలో నమోదయ్యాయి. అంతకుముందు గణాంకాలతో పోలిస్తే ఇదే కనిష్టం. యూరో న్యూస్ రష్యా యొక్క అధికారిక గణాంకాల ఏజెన్సీ ‘రోస్‌స్టాట్’ ప్రకారం.. గతేడాదితో పోలిస్తే 2024 మొదటి అర్ధ భాగంలో 16వేల తక్కువ జననాలు నమోదయ్యాయి. జనాభా క్షీణత అదనంగా 18శాతం పెరిగింది. ఇక ఈ ఏడాది 49వేల మరణాలు సంభవించాయి. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగానే ఈ మరణాలు సంభవించాయి.
Read More...