Elon Musk: బైడెన్, హ్యారిస్ ను హత్య చేసేందుకు ఎవరూ ప్రయత్నించట్లేదు

by Shamantha N |   ( Updated:2024-09-16 04:21:35.0  )
Elon Musk: బైడెన్, హ్యారిస్ ను హత్య చేసేందుకు ఎవరూ ప్రయత్నించట్లేదు
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump)పై మరోసారి హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనపై స్పేస్‌ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) స్పందించారు. డెమొక్రాట్ నేతలపై విమర్శలు గుప్పించారు. ‘‘అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను హత్య చేసేందుకు ఎవరూ ప్రయత్నించట్లేదు’’ అంటూ ఎక్స్ లో పోస్టు చేశారు. ట్రంప్‌నే ఎందుకు హత్యచేసేందుకు యత్నిస్తున్నారని ఓ యూజర్ చేసిన పోస్టుపైన మస్క్ ఇలా స్పందించారు. మరోవైపు, ఇప్పటికే అమెరికా ఎన్నికల్లో ట్రంప్ నకు పూర్తి మద్దతుని మస్క్ ప్రకటించారు.

అమెరికా ఎన్నికల వేళ..

ఫ్లోరిడాలోని వెస్ట్‌ పామ్‌ బీచ్‌లోని గోల్ఫ్‌ కోర్టులో ట్రంప్‌ గోల్ఫ్‌ ఆడుతుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. నిందితుడు ట్రంప్ పై కాల్పులు జరిపేందుకు సిద్ధమవుతుండగా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ అతడిపై కాల్పులు జరిపాయి. దీంతో నిందితుడి ఎఫ్ బీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం, ట్రంప్ సురక్షఇతంగానే ఉన్నట్లు వెల్లడించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల (US President Elections) ముందు ట్రంప్‌ను టార్గెట్‌ చేస్తూ ఇలాంటి ఘటనలు జరగడం ఇది రెండోసారి. ఈ ఏడాది జులైలో ట్రంప్‌ పెన్సిల్వేనియాలోని బట్లర్‌ పట్టణంలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తుండగా థామస్‌ మాథ్యూ క్రూక్స్‌ అనే యువకుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ట్రంప్‌ కుడి చెవి పైభాగం నుంచి బుల్లెట్ దూసుకువెళ్లింది. కాగా.. చిన్నపాటి గాయాలతో ఆయన బయటపడ్డారు.

Advertisement

Next Story