- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎట్టకేలకు తెరుచుకున్న గాజా సరిహద్దు.. మానవతా సహాయం పంపిణీ షురూ
గాజా: ఇజ్రాయెల్ వైమానిక దాడులతో అతలాకుతలమైన గాజాలోకి మానవతా సాయం వెళ్లేందుకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. దాదాపు రెండు వారాల ఇజ్రాయెల్ -హమాస్ యుద్ధం తర్వాత శనివారం మధ్యాహ్నం ఈజిప్టు- గాజా సరిహద్దులోని రఫా బోర్డర్ పాయింట్ ను తెరిచారు. దీంతో ఐక్యరాజ్యసమితి సంస్థలు, ప్రపంచ దేశాలు పంపిన సహాయక సామగ్రి ఈజిప్టు బార్డర్ నుంచి గాజాలోకి ప్రవేశించాయి. ఆ సామగ్రిని చిన్నచిన్న వాహనాల్లోకి ఎక్కించి గాజాలోని అన్ని ప్రాంతాలకు చేరవేయనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి శుక్రవారమే దాదాపు 200 ట్రక్కుల్లో 3 వేల టన్నులకు పైగా సహాయక సామగ్రి గాజా బార్డర్ కు చేరుకుంది.
అయితే ఇజ్రాయెల్ వైమానిక దాడుల కారణంగా ఈజిప్టు బార్డర్ నుంచి గాజా దిశగా వెళ్లే రోడ్లు దెబ్బతిన్నాయి. వీటికి రిపేరింగ్ జరిగితేనే.. వేగంగా సహాయక సామగ్రిని గాజా ప్రజలకు చేరవేసే వీలు కలుగుతుంది. ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్ అక్కడి పరిస్థితులను స్వయంగా సమీక్షిస్తున్నారు. యుద్ధం కారణంగా గాజాలో 10 లక్షల మందికి పైగా పౌరులు నిరాశ్రయులయ్యారు. ఇప్పటివరకు 4 వేల మందికి పైగా పాలస్తీనియులు చనిపోగా, 15వేల మందికి గాయాలయ్యాయి. నీరు, ఆహారం, మందులు, వైద్య సామగ్రి అందక గాజా ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు.